ఇదే అదును. తమిళనాట కొత్త పార్టీ పెట్టటానికి . అది కమల్ కావచ్చు రజని కావచ్చు. తమిళ నాట నెలకొన్న రాజకీయ పరిణామాలు మరో పార్టీ ఆవిర్భావానికి ఉత మిస్తున్నాయా.. ? అవుననే చెప్పవచ్చు . జయలలిత మరణం నుండి ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న తమిళనాట చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ప్రజలకు భరోసా ఇవ్వడానికి బదులుగా అన్నాడిఎంకే నేతలు అధికారం కోసం బజారున పడ్డతీరు దేశ ప్రజలందరూ చూశారు. జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు పాలైన శశికళ పరోక్ష పెత్తనం కొనసాగించేందుకు తన సమీప బంధువు దినకరన్‌ను తెర మీదకు తెస్తే ఆయనపైనా అవినీతి ఆరోపణలు భగ్గుమన్నాయి. ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కే కోట్ల రూపాయల లంచం ఇవ్వ చూపారన్న వార్తలు ప్రజానీకాన్ని నిశ్ఛేష్టులను చేశాయి. మరోవైపు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పళినిస్వామి ప్రజా సమస్యల పరిష్కారానికి చూపిన చొరవ అంతంత మాత్రమే! గడిచిన కొన్ని నెలలుగా పరిష్కారమైన ఒక్క కీలక సమస్య కూడా లేదంటే ఆశ్చర్యపడలేదు. ఆయన సమయమంతా ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడం, తోనే సమయం గడిసిపొతొంది
వాస్తవానికి దక్షిణాదిలో, ఆ మాటకోస్తే దేశంలోనే తమిళ రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది. కరడుగట్టిన హిందూ మత దురహంకారం మీద, ఆధిపత్య బ్రాహ్మణ భావజాలం మీదా తిరుగుబాటు బావుటా ఎగరేసిన చరిత్ర అక్కడి ద్రవిడ పార్టీలది! వెనుకబడిన కులాల స్వాభిమానం, ఆత్మగౌరవ సాధనే లక్ష్యంగా పెరియార్ రామస్వామి నేతృత్వంలో ప్రారంభమైన సామాజికోద్యమం మహోధృతంగా సాగి, రాజకీయ మలుపు తీసుకుంది. సంప్రదాయ పాలక పక్ష పార్టీలకు తమిళనాట స్థానం లేకుండా చేసింది. ఇదంతా చరిత్ర. వర్తమానం దానికి భిన్నం నిరంతరాయంగా కొనసాగిన ఆధిపత్య పోరు ద్రవిడ పార్టీలను ముక్కలు చెక్కలు చేసింది. రాజకీయ అధికారమే ఆ పార్టీలకు, వాటి అధినేతలకు అంతిమ లక్ష్యంగా మారింది.
ఎన్టీఆర్ టీడీపీ పార్టీ అవిభావానికి ముందు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి
ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది. 1982లో మహోన్నత లక్ష్యాల సాధనకోసం ఏర్పాటు చేసి తొమ్మిది నెలల వ్యవధిలో ఒక ఉద్యమంలా ఎగసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార బాధ్యతలను చేపట్టడంలో ఎన్టీఆర్ సఫలీకృతులయ్యారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు రాజకీయ అధికారం కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో కొనసాగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ నాయకత్వంలో నూతన యువతరం సునామీలా రాజకీయాల్లోకి దూసుకొచ్చి పేదలకు, యువతరానికి విద్యావంతులకు, మహిళలకు, వెనుకబడిన వర్గాలకు సీట్లు కేటాయించి రాజకీయాలను సామాన్యుల ముంగిటకు చేర్చిన పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయింది. ఇటువంటి ప్రరిస్థితి ప్రస్తుతం తమిళనాడు లో నెలకొని ఉంది ఎన్టీఆర్ టీడీపీ పార్టీ అవిభావానికి ముందు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందొ తమిళనాట అధికారం లో ఉన్న పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన ప్రజలు నిస్సహాయులు మిగిలారు. ఈ తరుణంలో ఉన్న పార్టీల కు ప్రత్యామ్యాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో రాజకీయాలలోకి రావడం తద్యమని ప్రముఖ నటుడు కమల్ హసన్ ప్రకటించారు. బిగ్ బాస్ కార్యక్రమం ముగింపు సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జాతికి సేవ చేయడానికి తాను మరణించడానికి సిద్దమని ఆయన అన్నారు.రాజకీయాలలో వస్తున్నానని గతం నుంచి అందరూ ఉహించి నట్లే ప్రకటించి ఊహాగానాలకు తెర దించారు
- మానవేంద్ర
.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి