సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమమని ప్రతి ఒక్కరూ చెప్పేమాట. అయితే నేటి డిజిటల్, స్మార్ట్ ఫోన్ల యుగంలో సోషల్ మీడియా సినిమాను కూడా బీట్ చేసేస్తోంది ప్రస్తుతం వెబ్‌సైట్లలో వచ్చే గాసిప్స్, సినిమా వార్తలకు ఉన్న కిక్కే వేరు! నెటిజన్లు కూడా ఈ గాసిప్స్ చదివేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్ని సైట్లు హద్దులు మీరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. నటులపై ఉన్నవీ లేనివీ అన్నీ కలిపి రాసేస్తున్నాయి. ఈ రాతల వల్ల కొన్ని సార్లు ఆయా నటులు బాధపడి తమ ఆవేదనను బహిరంగంగానే వ్యక్తపరిచిన సందర్భాలున్నాయి . తాజాగా ఇదే క్రమంలో కొన్ని వెబ్సైట్లు తమ పరువు మర్యాదలకు భంగం కలిగిస్తున్నాయని తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది .అ టువంటి వార్తలను ప్రచురించే సందర్భాల్లో వెబ్‌సైట్లు నైతిక విలువలు పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వారి మనోభావాలు దెబ్బతినకుండా ఇటువంటి వాటిని ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2, అక్టోబర్ 2017, సోమవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి