Translate

  • Latest News

    2, అక్టోబర్ 2017, సోమవారం

    ఐసిస్ చీఫ్ అబు బాక‌ర్ అల్ బాగ్దాది సజీవంగానే ఉన్నాడా ... ?


    ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బాకర్‌ అల్‌ బాగ్దాది సజీవంగానే ఉన్నాడనే ప్రచారం ఊపందుకుంది. బాగ్దాది ఆడియో రికార్డ్‌ను తాజా విడుదల చేశారు. ఈ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. జపాన్‌, అమెరికా దేశాలకు నార్త్‌ కొరియా జారీ చేసిన హెచ్చరికల గురించి ఆ ఆడియోలో మాట్లాడాడు. ఇరాక్‌లోని మోసుల్‌లో సాగిన యుద్దం గురించి కూడా బాగ్దాది పేర్కొన్నాడు. ఇస్లామిక్‌ నేత తలపై 25 మిలియన్ల డాలర్ల ఇనామ్‌ ఉంది. 2014 జూలై నుంచి మాత్రం అతని ఆచూకీ లేదు. దాంతో అతడి భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన అల్‌ ఫక్రన్‌ సైట్‌ ఈ ఆడియోను పోస్ట్‌ చేసింది. కలిఫా సోదరులను ఉద్దేశిస్తూ మాట్లాడిన బాగ్దాది.. ఇస్లామిక్‌ సైనికులు ఎవరూ తమ ఆయుధాలను విడిచిపెట్టరాదు అని పిలుపు నిచ్చారు. రఖాలో జరిగిన వైమానిక దాడుల్లో అల్‌ బాగ్దాది మతిచెంది ఉంటాడని రష్యా పేర్కొన్నది. కానీ అమెరికా మాత్రం అతను చావలేదు అని తేల్చింది. తాజా ఆడియోతోనూ బాగ్దాతీ సజీవంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
    ఐసిస్ చీఫ్ అబు బాక‌ర్ అల్ బాగ్దాది హ‌త‌మయ్యాడ‌ని  గతంలో ర‌ష్యా ప్ర‌క‌టించింది. సిరియాలో ఐసిస్ ఆధీనంలో ఉన్న ర‌క్కా ప‌ట్ట‌ణంపై ర‌ష్యా వైమానిక ద‌ళం నిర్వ‌హించిన దాడుల్లో బాగ్దాది చ‌నిపోయిన‌ట్టు ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది.క‌నీసం 30 మంది ఐసిస్ ఫీల్డ్ క‌మాండ‌ర్లు, 300 మంది ఉగ్ర‌వాదులు, బాగ్దాది వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త సిబ్బంది ఈ దాడుల్లో మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించారు. 46 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న బాగ్దాది 2013లో అల్‌ఖైదా నుంచి బ‌య‌టికి వ‌చ్చిన తరువాత అత‌ను ఐసిస్‌ను ఏర్పాటు చేశాడు. ఐసిస్ హ‌త్యోదంతం అత్యంత క్రూరంగా ఉంటుంది. గొంతు కోసి హ‌త‌మార్చ‌డం, పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీతో కాల్చ‌డం, బోనులో బంధించి నీటిలో ముంచడం ద్వారానో, లేక నిప్పుల‌పై నిల్చోబెట్టడం ద్వారానో హ‌త‌మార్చిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల ద్వారా ఇప్ప‌టికే బోలెడు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ క్రమంలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బాకర్‌ అల్‌ బాగ్దాది సజీవంగానే ఉన్నాడనే సమాచారం ఆందోళన కలిగిస్తుంది 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఐసిస్ చీఫ్ అబు బాక‌ర్ అల్ బాగ్దాది సజీవంగానే ఉన్నాడా ... ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top