Translate

  • Latest News

    2, అక్టోబర్ 2017, సోమవారం

    ఇరకాటంలో మోడీ ప్రభుత్వం... ఆర్థిక విప త్తుగా బీజేపీ సీనియర్‌నేత యశ్వంత్‌ విశ్లేషణ



    దేశం వెలిగి పోతుందంటూ గతంలో వాజపేయ్  ప్రభుత్వం అనుసరించిన ప్రస్తుతము అధికారం లో ఉన్న మోడీ ప్రభుత్వం ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. అత్యధిక మీడియా మోడీ జపం చేస్తూ వాస్తవాలు ప్రజలకు చేరకుండా చేస్తున్న క్రమంలో మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్‌నేత య శ్వంత్‌సిన్హా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన వ్యాసం  ప్రభుత్వ బండారాన్ని బయట పెట్టింది. ఈ లోగా సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలు , అసమర్ధత పై పెద్ద ఎత్తున విమర్శలు , నిరసన చెలరేగాయి 
    . ఈ దశలో  ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మునుపెన్నడూలేని విధంగా ఇరకాటంలో పడినట్టుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత మూడున్నరేండ్ల లో మోడీ అనుసరించిన ఆర్థిక విధానాలు, ఆయన హయాం లో దేశంలో జరిగిన మత విద్వేష ఘటనలు, రైతుల ఆత్మ హత్యలు, దళితులపై దాడులు, ధరల పెరుగుదలవంటి అం శాలపై ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీ నేతలు జవాబుదారీగా వ్యవహరించకుండా నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతూ నెట్టుకొచ్చారు. సొంత పార్టీకి చెంది న సీనియర్‌ నేతలు సుబ్రమణ్యస్వామి, అరుణ్‌శౌరీలాంటి వారి విమర్శలను కూడా వ్యక్తిగత దూషణలతో సరిపు చ్చారు. కానీ, మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్‌నేత య శ్వంత్‌సిన్హా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన వ్యాసం మాత్రం మోడీ అనుయాయుల్ని కలవరపెట్టినట్టుగా భావిస్తున్నారు. మోడీ అనుసరించిన విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేల యిందంటూ యశ్వంత్‌ చేసిన వివరణాత్మక విశ్లేషణలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని ఇరకాటపు పరిస్థితికి నెట్టినట్టుగా అర్థమవుతున్నది. వాస్తవానికి యశ్వంత్‌సిన్హా లేవనెత్తిన అంశాలమీ కొత్తవి కావు. అవన్నీ మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్లరద్దు,జీఎస్టీ వల్ల జరిగిన నష్టంపై ప్రతిపక్షాలతోపాటు ఆర్థికవేత్తలు చేసిన విమర్శలకు సంబంధించినవే. అయితే, ప్రతిపక్షాల విమర్శలన్నిటికీ ప్రధాని మోడీ టార్గెట్‌గా ఉండగా, యశ్వంత్‌ తన విశ్లేషణలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ని కూడా బాధ్యుడిని చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాన్ని నివారింప సాధ్యంకాని ఆర్థిక విప త్తుగా యశ్వంత్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. అంతేకాకుం డా, పేరుకుపోయిన మొండి బకాయిల గురించి, సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా తెచ్చిన జీఎస్టీ వల్ల జరిగిన నష్టం గురించి యశ్వంత్‌ వివరించారు. మోడీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎస్‌ ఎంఈ) కోలుకోలేని దెబ్బ తగిలిందని సిన్హా స్పష్టం చేశారు. దేశంలోని ప్రధాన వాణిజ్యం ఈ వర్గాల(ఎస్‌ఎంఈ) ద్వారా నేనని ఆయన తెలిపారు. నగదు లావాదేవీలు, అసంఘటిత కార్మికులపై ఆధారపడి ఎస్‌ఎంఈ కార్యకలాపాలు సాగుతాయని ఆయన విశ్లేషించారు. 'నోట్ల రద్దు, జీఎస్టీ అంశాలపై వ్యాపార వర్గాల నుంచి మాకు తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. అంబానీ, అదానీలాంటి బడా పారిశ్రామికవేత్తల మేలు కోసమే మోడీ ప్రభుత్వ విధా నాలున్నట్టుగా ఆ వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన ట్టు తెలుస్తున్నది
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇరకాటంలో మోడీ ప్రభుత్వం... ఆర్థిక విప త్తుగా బీజేపీ సీనియర్‌నేత యశ్వంత్‌ విశ్లేషణ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top