Translate

  • Latest News

    2, అక్టోబర్ 2017, సోమవారం

    బీపీ, షుగర్ బాధితుల్లో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ


    బీపీ, షుగర్ బాధితుల్లో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నట్టు జాతీయ పోషకాహార సంస్థ నివేదిక వెల్లడించింది. పట్టణాల్లో 31 శాతం మంది పురుషులు, 26 శాతం మంది స్త్రీలు బీపీతో బాధపడుతున్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. మధుమేహంతో 22 శాతం మంది పురుషులు, 19 శాతం మంది స్త్రీలు బాధపడుతున్నట్టు చెప్పింది. దేశంలోని 16 నగరాలలో లక్షా 72 వేల మందిపై నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో (ఎన్‌ఎన్‌ఎంబీ) అధ్యయనం చేసింది. 2015-16 సంవత్సరంలో చేసిన అధ్యయనం వివరాలను డైట్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా అండ్ ప్రివేలెన్స్ ఆఫ్ ఒబెసిటీ, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పేరుతో హైదరాబాద్ తార్నాకలోని ఎన్‌ఐఎన్ విడుదల చేసింది. అధిక బరువు, స్థూలకాయం, శారీరకశ్రమ లేకపోవటంవల్ల కూడా బీపీ, షుగర్ బారిన పడుతున్నట్టు వివరించింది. దేశం మొత్తం మీద బీపీ బాధితులు కేరళలో ఎక్కువగానూ, బీహార్‌లో తక్కువగానూ ఉన్నారు. దేశంలో 16 శాతం మందికి ధూమపానం, 30 శాతం మందికి మద్యంసేవించే అలవాటు ఉన్నట్టు ఈ అధ్యయనం పేర్కొంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బీపీ, షుగర్ బాధితుల్లో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top