బీబీసీ తెలుగు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది . ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద నెట్ వర్క్ ఉన్న బీబీసీ తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో కూడా వార్తావెబ్‌సైట్లను బీబీసి అక్టోబర్ 2 నుంచి ప్రారంభించి ప్రస్తుతం ఉన్న న్యూస్ చానల్స్ కు గట్టి పోటీ ఇవ్వనుంది .బీబీసీ న్యూస్ ప్రసారాలు ఇప్పటికే బెంగాలీ, హిందీ, ఉర్దూ భాషల్లో 28 మిలియన్ల మందికి చేరుతున్నాయి. తెలుగు వెబ్‌సైట్‌తో పాటు ప్రతిరోజూ అరగంట బులెటిన్‌ను బీబీసి తెలుగులో ప్రసారం చేస్తుంది.
బీబీసీ ప్రపంచం' పేరుతో ఈ బులెటిన్ సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ రాత్రి 10.30కి ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానెళ్లలో ప్రసారమవుతుంది. హిందీలోనూ 'బీబీసీ దునియా' పేరుతో న్యూస్ బులెటిన్‌ను పున:ప్రారంభిస్తోంది. ఇది 'ఇండియా టీవీ' ఛానల్‌లో ప్రసారమవుతుందని పేర్కొంది
వర్తమాన విషయాలకు అద్దం పడుతూ వార్తలు , విశ్లేషణ లు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది .గత ఏడాదే న్యూస్ కు సంభందించి ప్రకటన వెలువరించిన బీబీసీ దేశంలో వివిధ ప్రాంతాలలో నియామకాలు పూర్తి చేసి శిక్షణ కూడా ఇచ్చి బరిలోకి దిగింది . పార్టీల వారీగా చీలి పోయిన తెలుగు మీడియా లో బీబీసీ ద్వారా నిష్పక్షపాత సమాచారం ప్రజలకు అందే అవకాశం వచ్చిందని భావిస్తున్నారు
బీబీసీ తెలుగు వెబ్ సైట్ లింక్ ఇది ... https://www.bbc.com/telugu
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి