కళాకారులు ప్రజా సమస్యలపై స్పందించటం ,గళమెత్తటం పరిపాటి. భారత స్వాతంత్య పోరాటం నుంచి నేటి వరకు కవులు, కళాకారులు సమస్యలపై స్పందించటంలో ముందజలోనే ఉన్నారు. ఈ దశలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేధావుల పై దాడులు పెరిగాయి . ప్రశ్నించటం నేరమైంది . ప్రశ్నించటం దేశద్రోహమైంది.
మతోన్మాదం జడలు విప్పింది. చర్చిలపై దాడులు పెరిగాయి. లవ్ జిహాద్, ఘర్ వాప్‌సీ పేరిట బలవంతపు మత మార్పిడులు జరిగాయి. బీఫ్ బ్యాన్ పేరిట మతతత్వ శక్తులు బీభత్సం సృష్టించాయి. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతోనే మోది పాలన కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. మోది రెండేళ్ల పాలన- ప్రజాతంత్ర హక్కులు కాలరాస్తూ... పార్లమెంటరీ ప్రజాస్వామిక సంస్థలను కుదేలు చేస్తూ నిరంకుశ ధోరణులకు తెర లేపింది. లవ్ జిహాద్, ఘర్ వాపసి, బీఫ్ బ్యాన్ లాంటి చర్యల ద్వారా హిందుత్వ సంస్థలు ముస్లింలలో విద్వేషాన్ని రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించారు. గోమాంసం కలిగి ఉన్నాడనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో అక్లాఖ్‌ను హత్య చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌లోని లతేహర్‌లో గోవుల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు యువకులను బహిరంగంగా ఉరితీయడం వంటివి వాతావరణాన్ని మరింత దిగజార్చాయి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి