మగాడు ఎన్ని పెళ్ళిలైన చేసుకోవచ్చు . కానీ వంటరిగా ఉంటున్న ఒక మహిళ తనకు ఒక తోడు కావాలని కోరుకోవటం తప్పయింది . రేణుదేశాయ్ పవన్ కల్యాణ్ తో విడిపోెయిన తరువాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డైరక్షన్, ప్రొడ్యూసర్ గా చేస్తూ తాను ఏంటో నిరూపించుకుంది. అయితే చాలా కాలం తరువాత తెలుగులో ఓ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆమె ..ఛానల్ ఇంటర్యూ లో పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
తనకు ఏడాది క్రితం వరకు పెళ్లి, లవ్, రిలేషన్లపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది. కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందని అన్నారు. ఆ సమయంలో తన దగ్గర ఉండి పిల్లల్ని, తనని చూసుకునేవారు ఉంటే బాగుండేదని అనుకున్నారట. ఆస్పత్రికి తన అక్క తీసుకువెళ్లేదని అన్నారు. అంతేకాదు దేవుడు ఎవరినైనా పంపిస్తే చూద్దాం.ఎందుకంటే మనకు తెలీదు కదా.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ప్రస్తుతానికి ఎవరూ లేరు అంటూ రేణుదేశాయ్ తన మనసులోని బాధను, భావాన్ని వ్యక్తం చేశారు.
రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. ఆమె మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో చర్చ కు దారితీసింది. పవన్ తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ తోనే ‘జానీ' సినిమాలో నటించింది. 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. 2009 లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్యా పుట్టింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి