Translate

  • Latest News

    4, అక్టోబర్ 2017, బుధవారం

    ప్రపంచ పర్యాటక కేంద్రాలకు సైతం మత మౌఢ్యం వ్యాపించింది


    ప్రపంచ పర్యాటక  కేంద్రాలకు సైతం మత మౌఢ్యం వ్యాపించింది .ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి విడుదల చేసిన బుక్‌లెట్‌లో గంగా నదికి హారతి ఇవ్వడాన్ని ముఖచిత్రంగా ఇచ్చారు. ప్రతి ఏటా దాదాపు 60 లక్షల మంది పర్యాటకులు, ఎక్కువగా విదేశీయులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. తాజ్‌మహల్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించగా.. ప్రధాని మోదీ ‘క్లీన్‌ ఇండియా మిషన్‌’కు ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో తాజ్‌మహల్‌ చోటు దక్కించుకుంది. రామాయణం, భగవద్గీతలు మాత్రమే భారతీయ సంస్కృతికి చిహ్నాలనీ, తాజ్‌మహల్‌ ఎంతమాత్రం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

      అంధుల రాజ్యంలో గుడ్డి దర్బారు అంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు గురించి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఒక్క ముక్కలో వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీకి అంత కోపం రావటానికి కారణం ఉత్తరప్రదేశ్‌ పర్యాటక శాఖ ప్రచురించిన ప్రత్యేక పుస్తకంలో ప్రపంచంలోనే ఏడో వింతగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్‌ గురించి ఒక్క వాక్యం కూడా కనిపించకపోవడమే. సూర్యుడి వెలుగును దీపం సహాయంతో చూపించాలనుకోవడం లాంటిది అధికారుల తీరు అని ఆయన విమర్శించారు. తాజ్‌మహల్‌కున్న ప్రపంచ ప్రఖ్యాతిని ఈ సర్కారు గుర్తించలేకపోవడం వల్ల ఆ అద్భుత కట్టడానికి ఉన్న గొప్పదనం ఏ మాత్రం తగ్గదని ఆయన అన్నారు. తాజ్‌మహల్‌ ప్రస్తావన లేకుండా పర్యాటక కేంద్రాల గురించి పుస్తకం ప్రచురించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదో పెద్ద జోకులా ఉంది. కానీ అంథకన్నా ఎక్కువ బాధ కలిగిస్తోంది అన్నారాయన.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రపంచ పర్యాటక కేంద్రాలకు సైతం మత మౌఢ్యం వ్యాపించింది Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top