సంచలనం కోసం కొంతమంది వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. మీడియా , సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు వారు అనుకున్న విధంగానే వైరల్ అవుతాయి. తాజాగా యూపీలో ప్రతిపక్ష పార్టీ నేత ఆజం ఖాన్.. ఓ బానిస కట్టడంగా తాజమహల్ ను పేర్కొన్నారు. దానిని తక్షణ మే కూల్చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రజల్లో తనకు ఎంతో పాపులారిటీ ఉందని కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి తాను మద్దతిస్తానని సంబంధం లేని వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. నిజానికి ఆజం ఖాన్ ఏదో ఒక విషయంపై ఫైర్ అవుతూనే ఉన్నారు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని గతంలో ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. అయితే మహిళలంతా పాకిస్థాన్ కు పారిపోండి అంటూ అత్యంత వివాదం సృష్టించారు. ఇక నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. `` నీ ఇల్లు కూలగొట్టుకుంటావా నేను మద్దతిస్తాను`` అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హాట్గా మారింది. మరి ఆజం స్పందిస్తాడో లేదో చూడాలి.
5, అక్టోబర్ 2017, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి