Translate

  • Latest News

    5, అక్టోబర్ 2017, గురువారం

    కేరళ లో బీజేపీ కుట్ర బహిర్గతం ...మరో రాష్టంలో పాదయాత్ర కు పావులు కదుపుతున్న కమల నాథులు







    తాము నమ్మిందే సిద్దాంతం . తాము చెప్పిందే వేదాంతం అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి కొన్ని పార్టీలు . ఇక్కడ ఇదే జరుగుతుంది. తమ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో లేని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తుంది
     ఇప్పటికే తమిళనాడు లో అధికార ప్రభుత్వ న్ని  ఏ విధంగా అస్థిరం చేసింది చూశాం .గోవా ,మణిపూర్ లలో  మెజార్టీ ఉన్న పార్టీలను తోసిరాజని అందలం ఎక్కటానికి చేసిన ఘటనలు చూసాం. ప్రస్తుతం బీజేపీ ధృష్టి  సిపిఎం నేతృత్వంలోని  కేరళ పై పడింది . ఎదో జరిగిపోతూన్నట్లు తన అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు . దేశ ప్రజల ధృష్టి కేరళ వైపు మరల్చగలిగారు. హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయంటూ బీజేపీ కేరళ లో  జనరక్ష పాదయాత్రను చేపట్టింది . ఇందుకు పూర్వమే అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ విజృంభించిది.

      కేరళ పోలీస్‌ శాఖ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దాడుల్లో సిపిఎం కార్యకర్తలు 85 మంది ప్రాణాలు కోల్పోగా, 65 మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు మరణించారు. హైదరాబాద్ లో జరిగిన దాడుల అనంతరం  ప్రచారం మాదిరి కేరళ లో దాడులు జరగక ముందే వాటిని ఖండిస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ లు వెవడటం తో అసలు రంగు బయట పడింది 

    . కల్బుర్గి నుండి గౌరీ లంకేశ్‌, త్రిపుర పాత్రికేయుడు శంతను భౌమిక్‌ వరకు సాగిన హత్యాకాండపై పెదవి విప్పడానికి ఏమాత్రమూ సిద్ధపడని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కేరళలో పాదయాత్ర ను ప్రారంభించటం విశేషం .ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావులేదని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. కానీ, దుర‌దృష్ట‌వ‌శాత్తు కేరళలో ఇది రాజకీయ హత్యాకాండలకు దారితీస్తుందని ఆరోపించారు. కేరళలో బీజేపీ కార్యకర్తలపై దాడులకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొని యోగి ప్రసంగించారు. బీజేపీ కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి కుమానమ్ రాజశేఖరన్‌తో కలిసి ఏడు కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ యాత్రతో సిపిఐ (ఎం) దుష్టపాలన గురించి ప్రజల్లో చైతన్యం వచ్చిందని, మద్దతుగా భారీ సంఖ్యలో బయటికి వస్తున్నారని యోగి అన్నారు. పదిహేను రోజులపాటు కేరళ వ్యాప్తంగా సాగే ఈ యాత్ర అక్టోబరు 17 న తిరువనంతపురంలో ముగుస్తుంది. ఈ యాత్రలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గోనున్నారు. 

    . ఇక ఉత్తరప్రదేశ్ లో ప్రజాస్వామ్యం పోయి ఆటవిక పాలన కొనసాగుతున్నట్లు మేధావులు విమర్శిస్తున్నారు.  యోగి ఆదిత్యనాథ్‌ కనుసన్నల్లో ప్రారంభమైన హిందూ యువ వాహిని ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండకు దిగుతోంది. దళితులు, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని యువ వాహిని చేస్తున్న దారుణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ హింసాకాండ బారిన పడి ఛిద్రమైన కుటుంబాలు ఎన్నో! సొంత రాష్ట్రంలో నెలకొన్న ఈ దారుణాలపై పెదవి విప్పని యోగి  కేరళలో ప్రజాస్వామ్య సూత్రాలను వల్లె వేయడం విస్మయం కలిగిస్తోంది. సొంత రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండకు ముఖ్యమంత్రిగా ప్రత్యక్షంగానూ పరోక్షంగా మద్దతిస్తున్న ఆయన కేరళలో పర్యటించటం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . మొత్తం మీద కేరళ పై కన్నేసిన బీజేపీ , పాదయాత్ర అనుకున్న మేర సక్సెస్ అవ్వటంతో ఇదే విధంగా మరో రాష్టంలో పాదయాత్ర కు పావులు కదుపుతుంది .

                                                           -మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కేరళ లో బీజేపీ కుట్ర బహిర్గతం ...మరో రాష్టంలో పాదయాత్ర కు పావులు కదుపుతున్న కమల నాథులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top