అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన బెంగళూరు జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేసారు ఈ కేసులో దాదాపు 250 మందిని ప్రశ్నిస్తున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ బి.కె సింగ్ చెప్పారు గత నెల తన నివాసం గేట్ వద్ద గౌరీ లంకేష్ ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.. గౌరీ లంకేష్ ʹలంకేష్ పత్రికʹకు ఎడిటర్. ఆమె పత్రిక ద్వారా రాజకీయ నాయకుల అనేక అక్రమాలను బహిర్గతపర్చారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాశారు. గౌరీ లంకేష్ మతోన్మాదానికి వ్యతిరేకంగా రచనలు చేయడమే కాక అనేక ఆందోళనలో పాల్గొన్నారు.
14, అక్టోబర్ 2017, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి