Translate

  • Latest News

    14, అక్టోబర్ 2017, శనివారం

    ఒంట్లో ఫ్యాట్‌ తగ్గించే విషయంలో అలసత్వం వద్దు


    ఒంట్లో ఫ్యాట్‌ తగ్గించే  విషయంలో మహిళలు మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 12 ఏళ్ల పాటు అనారోగ్యకారణాలతో చనిపోయిన మహిళలపై పరిశోధన చేసి, ఓ సంస్థ వెల్లడించిన నిజాలు ఇవి. మహిళలు మెనోపాజ్‌ సమయంలో ఉన్నప్పుడు కొవ్వు శాతం పొట్ట ప్రాంతంలో పెరుగుతుంది. ఈ కారణంగా ఒబెసిటీ సంబంధిత కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. అలాగే మహిళల్లో హార్మోన్లను తగ్గించడానికి ఉత్పత్తయ్యే ఇన్సులిన్‌ ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులు లేదా పేగు కేన్సర్లు కూడా వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
     కొవ్వు ఎక్కువగా వంట నూనె ద్వారా లభిస్తుంది. ఇది శరీరానికి సరిపోతుంది. కాబట్టి ఇతర ఆహార పదార్థాల్లో అదనంగా లభించే ఫ్యాట్‌ను తగ్గించుకోవడంపై మనసు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే బరువు తగ్గాలనే మీ కల సాకారమవుతుందని హితబోధ చేస్తున్నారు.
     వంటనూనె ఒకే రకమైనది కాకుండా కొనుగోలు చేసిన ప్రతిసారీ మారుస్తుండాలి. అంటే ఒకసారి రైస్‌బ్రౌన్‌ అయిల్‌ తీసుకుంటే మరొకసారి గ్రౌండ్‌నట్‌, మరోసారి సన్‌ఫ్లవర్‌, తర్వాత ఆలివ్.. ఇలా మార్చి మార్చి వాడాలి.
    * వెల్లుల్లిలో ఐసిన్‌ అనే యాంటి అక్సిడెంట్‌ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడకుండా కాపాడుతుంది. కాబట్టి రోజూ ఏదో ఒక సమయంలో పచ్చి వెల్లుల్లి తినే అలవాటు చేసుకోవాలి.
    * వారంలో రెండు రోజులు చేపలు తినాలి. చేపల్లో ఒమెగా 3 అనే ఫ్యాటీ యాసిడ్‌ లభిస్తుంది. ఇది రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.
    * ఆలివ్‌ ఆయిల్‌లో మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి.
    * గోధుమలో ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్‌ కొలెస్ట్రాల్‌తో బైండ్‌ అయి శరీరం నుంచి బయటకు పంపించి వేస్తుంది. ఫైబర్‌ గోధుమలోనే కాకుండా ఓట్స్‌, బార్లీ, రాగి, జోవర్‌లలో కూడా సమృద్ధిగా లభిస్తుంది. అందుకే అన్నానికి బదులుగా పై పదార్థాలు తినడానికి ప్రయత్నించాలి.
    * తృణ ధాన్యాలు (రాగులు, సజ్జలు, కొర్రలు తదితరాలు) కొవ్వును కరిగించడమే కాకుండా మంచి పోషకాలు ఇస్తాయి. వీటిని కూడా అన్నానికి బదులుగా తినేందుకు మీ మెనూలో చేర్చుకోవాలి.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఒంట్లో ఫ్యాట్‌ తగ్గించే విషయంలో అలసత్వం వద్దు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top