Translate

  • Latest News

    13, నవంబర్ 2017, సోమవారం

    ఆ కు కూరలు తినండి... ఆరోగ్యంగా ఉండండి


    ఆ కు కూరలు తినండి... ఆరోగ్యంగా ఉండండి... తరుచూ ఆకుకూరలతో భోజనం చేస్తే ఎలాంటి జబ్బులు ధరిచేరవని అంతే కాకుండా మానవుల ఆయుష్షును పెంచే ఎన్నో సద్గుణాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. తరుచూ మాంసాహారంతో భోజనం చేసే వారితో పోల్చితే ఆకుకూరలతో భోజనం చేసే వారు పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నారని పలు సర్వేలు సైతం చెబుతున్నాయి. మన ఆరోగ్య విషయంలో ఆకు కూరలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆకు కూరలు పూదీన, గోంగూర, మెంతికూర, తోటకూరలను అధికంగా తీసుకుంటే ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇనుము లోపంతో బాధపడుతున్న వారు గర్భిణులు, బాలింతలు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి. తరుచూ ఆకు కూరలను తీసుకోవడంతో రక్తహీనత నివారించవచ్చు.

    ఆకు కూరల్లో అనేక పోషకాలు...
    ఆకు కూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ సీ కూడా ఉంటాయి. మనదేశంలో 32 వేల మంది 5 సంవత్సరాలలోపు పిల్లలు విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ఓ అధ్యాయనంలో తేలింది. ఆకుకూరలు తీసుకుంటే వాటిలో ఉండే కెరోటిన్ శరీరానికి విటమిన్ ఏ అందుతుంది. తద్వారా కంటి చూపు కూడా పెరుగుతుంది. అంతే కాకుండా విటమిన్ సీ సైతం ఆకు కూరలో పుష్కలంగా ఉంటుంది. ఆకు కూరలు వండే సమయంలో ఎక్కువగా ఉడకబెట్టకుండా ఉంటే అందులోని విటమిన్ సీ నష్టపోకుండా ఉంటుంది. పెద్దవారిలో మగవారు రోజుకు 40 గ్రాములు, ఆడవారు 100 గ్రాములు మూడేండ్ల వయస్సు ఉన్న చిన్న పిల్లలు 40 గ్రాములు, 4-6 వయస్సు ఉన్న వారు 50 గ్రాములు, అలాగే 10 ఏండ్లలోపు పిల్లలు రోజుకు 50 గ్రాములు తీసుకోవాలి. పిల్లలకు ఆకు కూరలు పెట్టడం మూలంగా వారిలో జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు విటమిన్ ఏ, సీలు అందుతాయి.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆ కు కూరలు తినండి... ఆరోగ్యంగా ఉండండి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top