ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మీడియా ను విస్తరించుకొంటూ పోతుంది. ఇది ఇప్పుడే వచ్చిన పరిణామ మని చెప్పలేం . తమిళనాట ఈ కల్చర్ ఎప్పటి నుంచే ఉన్నదే . మీడియా అనేది జరుగుతున్న విషయాలను ఉన్నదున్నట్లుగా రిపోర్ట్ చేయాల్సి ఉండగా ప్రస్తుత పత్రికలు ,మీడియా లోని విషయాలను చూస్తే – వార్తలకంటే వ్యక్తిగత అభిప్రాయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారని అనిపిస్తుంది. కానీ నిజానికి జర్నలిజం అనేది మనకి వార్తలందించడానికుంది, వారి అభిప్రాయాలను అందించడానికి కాదు. గతంలో వార్తా పత్రికల్లో కేవలం 2% మాత్రమే అభిప్రాయాలను ఎడిటోరియల్ ద్వారా వ్యక్తం చేసేవారు. కానీ ఇవేళ 50 % నికి పైగా వ్యక్తిగత అభిప్రాయాలే! న్యూస్ పేపర్లు ఇటువంటి దృష్టి కోణాలతో నిండిపోతే దేశం వివేకవంతులని కోల్పోతుంది.జరుగుతున్న విషయాలను ఉన్నదున్నట్లుగా రిపోర్ట్ చేస్తే
అది చూసిన ప్రేక్షకులు వారి వారి అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. అది వారికి వదిలి వేయాలి ... అలా కాకుండా మీడియా తన ‘వ్యూ’ ని, తన అభిప్రాయాలనీ జోడించి చెపుతూ ఉంటే వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతోందన్న విషయం ప్రజలకి తెలుసు. ఇందువల్ల ఆ వార్త లోని విషయం తగ్గి ప్రజలు నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడుతొంది
మీడియా ఎప్పుడూ కూడా సత్యాన్నేచూడాలి. ఆ బాటలోనే నడవాలి. నిజాన్నే చూపించాలి. అంతే కానీ ఎవరి అభిప్రాయం ప్రకారమో నడుచుకోకూడదు . కానీ ఇదంతా చెప్పుకోవడానికే బాగుంటుంది . జీతం ఇచ్చే యజమాని ఆదేశాలు దాటి నిజమైన వార్త బయటికి వచ్చే పరిస్థితి ఉందా ... మీడియా ఇలా రాజకీయాల వైపూ, రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపుతుంటే రాజ్యాంగ వ్యవస్థ లోని 4 th ఎస్టేట్ అని అనగలమా ...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి