నియోజకవర్గాల పునర్వివ్యస్త్రీకరణ పై తెలుగు రాష్ట్రాల చంద్రులు కేంద్రంపై దింపడుకల్లెం ఆశలు పెట్టుకొనే ఉన్నారు. ఒక వైపు ఇప్పట్లో నియోజకవర్గాల పునర్వివ్యస్త్రీకరణకు అవకాశమే లేదని కేంద్రం తేల్చి చెబుతున్నా ... మరోవైపు కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వెలువడుతుందని కొత్త గా చేరినవారికి , చేరే వారికి ఉరించటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ముందంజలోనే ఉన్నారు.ప్రధాని మోడీ ని కలిసిన అనంతరం నియోజక వర్గాల పెంపు అంశంపై తిరిగి చర్చ మొదలయింది
నియోజకవర్గాల పునర్వివ్యస్త్రీకరణ లేక పొతే కొత్తగా వచ్చిన వారికి బెర్తు కేటాయించండం కష్టం . ఇప్పటికే ఆయా పార్టీల్లో అంతర్గత పోరు తీవ్రమైంది. ఒకవైపు ఈ అంశం వల్ల తమకు వచ్చిన నష్టం ఏమిలేదని మేకపోతు గాంభీర్యం వహిసూన్నా కొత్తగా పార్టీలో చేరిన వారితో రానున్న రోజుల్లో కష్టాలు మరిన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, తెలంగాణాలో తెరాసా ఎవరికి వారే రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని వివిధ పార్టీలకు చెందిన వారిని తమ పార్టీ కండువా కప్పి అధికారపార్టీలో చేర్చుకున్నారు.. ఇందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు కేంద్రంపై దింపడుకల్లెం ఆశలు పెట్టుకొనే ఉన్నారు. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వెలువడుతుందని కొత్త గా చేరినవారికి ఊరిసూన్నారు.
ఇదంతా అంత సులువుగా జరిగే ప్రక్రియ కాదని తెలుసు. కానీ కొంత కాలం ఈ అంశం పై ఆశలు కల్పించాలి. చివరి దాకా తీసుకు వచ్చి కాక పోతే నెపం కేంద్రంపై వేయాలి . అంతా పక్క ప్లాన్ . నాయకులకు తెలుసు . చేయగలింది అమీ తుమీ తేల్చుకొనే పరిస్థితి లేదు. అధినేత చెప్పింది వినటం తప్పా . ఇక్కడ చిన్న విషయం నియోజక వర్గాల పెంపు వ్యవహారం వల్ల ప్రజలకు వనగోరే ప్రయోజనం మాత్రం శూన్యం
శ్రీ హర్ష
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి