Translate

  • Latest News

    14, జనవరి 2018, ఆదివారం

    Google Doodle లో రచయిత్రి మహా శ్వేతాదేవి


     ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహా శ్వేతాదేవీ 92 వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రముఖ స్తానం కల్పించింది.  మహా శ్వేతాదేవీ పేరు తెలియని వారు బహుశా భారతదేశంలో ఎవరూ ఉండరు. అక్షరమే ఆయుధంగా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన సాహితీవేత్త. నవలల ద్వారా, కథల ద్వారా అణగారిన వర్గాల ఆర్తనా దాలను సమా జానికి చాటి చెప్పిన ఈ బెంగాలీ రచయిత్రి అందు కున్న అవార్డులు అసంఖ్యాకం. పద్మవిభూషణ్, మెగ సేసే, జ్ఙానపీఠ్, సాహిత్య అకాడమీ, దేశీకొట్టమ్ అవార్డులు, పురస్కారాలు ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. ఆమె రచనలు ‘హజార్ చౌరాసీకీ మాం’, ‘అర ణ్యేర్ అధికార్’, ‘ఝాన్సీకీ రాణీ’, ‘అగ్నిగర్భ’, ‘రుదాలీ’, ‘సిధూ కన్హర్ దాకే’ … ఇంకా ఇలాంటి అనేక అద్భుతమైన రచనల్లో బడుగు బలహీనవర్గాల జీవితాలను సమాజా నికి పరిచయం చేశారు. ఆమె రాసిన అనేక కధలను సినిమా లుగా తీశారు. గోవింద్ నిహ్లానీ తీసిన ‘హజార్ చౌరాసీకీ మాం’ (1084 తల్లి) గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. నక్సలైటు ఉద్యమంలో తన కొడుకు ఎందుకు చేరాడో తెలుసుకోవాలన్న ఒక తల్లి ప్రేగు బాధను ఆమె నవలగా మలిచారు. సూరంపూడి సీతారాం ఈ నవలను ‘ఒకతల్లి’ పేరుతో తెలుగులో అనువదిం చారు.గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులను, బడుగు బలహీనవర్గాలను సమీకరించి, వ్యవస్థీకృతంగా వారు తమ సమస్యలను పరిష్కరించుకునేలా వారిలో చైతన్యా న్ని సృజించారు. గిరిజన, ఆదివాసీల సంక్షేమం కోసం ఆమె అనేక సంస్థలను కూడా స్థాపించారు. గొప్ప రచ యిత్రిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నా అతి సాధారణ జీవితాన్ని గడిపిన మహోన్నత మహిళ మహా శ్వేతాదేవీ.బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం పోరాటము, రచనా వ్యాసంగం రెండింటినీ కొనసాగించిన అద్భుత మైన సామర్థ్యం ఆమె స్వంతం. చాలా మంది రచయిత లు, కవులు సామాజిక కార్యక్రమాల్లోకి వచ్చినప్పుడు రచనా వ్యాసంగం తగ్గించడం జరుగుతు ంది. కాని మహా శ్వేతాదేవి రెండింటికి న్యాయం చేశారు. ఆమె కథలు, ఆమె నవలలు అన్నీ ఆమె సామాజిక సేవా కార్యక్రమా లతో పాటే వచ్చాయి.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: Google Doodle లో రచయిత్రి మహా శ్వేతాదేవి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top