జగన్ @ 1000 కి.మీ.
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ వచ్చే ఎన్నికల్లో అధికార పీఠం అధిష్టించడానికి పాదయాత్రనే అస్త్రంగా చేసుకున్నారు. 3000 కి.మీ. యాత్రలో భాగంగా యాత్ర 74 వ రోజున 1000 కి.మీ. యాత్రను పూర్తి చేశారు. మూడొంతుల యాత్రలో ఒక వంతు పూర్తిచేసినట్టే... సుమారుగా అక్టోబర్ నాటికి ఆయన అనుకున్నట్టుగా 3000 కి.మీ. పూర్తిచేసేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే పాదయాత్ర లక్ష్యమైన అధికార పీఠం దక్కించుకోగలరా... లేదా అనేదే వెయ్యి డాలర్ల ప్రశ్న... పోల్ మేనేజిమెంట్ లో ప్రపంచానికే పాఠాలు నేర్పుతున్న చంద్రబాబు ఎత్తుకు పైఎత్తులను సమర్ధంగా తట్టుకుని అంతిమంగా విజయం సాధిస్తారా అన్నదే ఆ పార్టీ అభిమానుల్లో కూడా అంతర్లీనంగా మెదులుతున్న అనుమాన భూతం. ఎందుకంటే నాయకుడు ఎంత కస్టపడి పనిచేస్తున్నా... బూత్ స్థాయిలో పార్టీ యంత్రాగం పటిష్టంగా లేకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ రోజు అధినేత ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ...
వీళ్లు ఇలా యాత్రల్లో మునిగి ఉండగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కామ్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలో ఓటర్ల జాబితాలు దగ్గర పెట్టుకుని ఏ ఓటరు ఎటువైపో గుర్తిస్తూ తమకు గ్యారంటీగా పడవనుకున్న ఓట్లను తొలగింపచేస్తూ, అటు..ఇటుగా ఉండే ఓటర్లను గుర్తించి వారిని ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి కొనేయడం ద్వారా గెలుపును సునాయాసం చేసుకోవడానికి పక్కాగా ప్లాన్ అమలుచేస్తున్నారు. ఈ ప్లాన్ 175 నియోజకవర్గాల్లో అమలవుతొంది. జగన్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గుర్తించకుండా జగన్ కు వచ్చే జనాల్ని చూసి మురిసిపోతే మళ్లి 2014 రిపీట్ అవుతుంది. సో... వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా... ఇప్పటికయినా కళ్ళు తెరవండి...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి