రైతుల గోల... ఇక్కడ చంద్రబాబు పాలనలోనే అనుకున్నాం...మన చంద్రబాబు గారి బాబు లాంటోడు మహారాష్ట్రలో ఉన్నాడండి బాబు... ఆయనే ది గ్రేట్ దేవేంద్ర ఫడ్నవిస్. ఈయన 2014 అక్టోబర్ 31 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈయన హయాంలో కేవలం గత నాలుగు నెలల్లో 852 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఆల్ టైం వరల్డ్ రికార్డు. ఫడ్నవీస్ ఆర్.ఎస్.ఎస్ మూలాల నుంచి వచ్చినోడు. కేవలం 44 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన పాలనలో రైతుల్ని పూర్తిగా తుడిచిపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నాడని ఓర్వలేక కన్ను కుట్టి అల్ ఇండియా కిసాన్ సభ (ఏ.ఐ.కె.ఎస్) ఆధ్వర్యంలో మార్చ్ 6 న నాసిక్ నుంచి ముంబై కి 25 వేల మంది రైతులతో 180 కి.మీ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. దారిలో మరికొంత మంది రైతులు కలసి 35 వేల మంది అయ్యారు. ఇది మరి కొంత మంది రైతులకి ప్రేరణ ఇచ్చింది కాబోలు... దారిలో మరికొంత మంది కలిశారు. ఇలా దారి పొడుగూతా కలుస్తూ పోతున్నారు. ఈ నెల 12 న అంటే సోమవారం ఈ లాంగ్ మార్చ్ ముంబై చేరే నాటికి మొత్తం 50 వేల మంది రైతులతో మహా లాంగ్ మార్చ్ కానుందని ఎర్ర జెండా వాళ్ళు పెద్ద బడాయిగా గొప్పలు చెప్పుకుంటున్నారు లెండి. వీళ్లెన్ని లాంగ్ మార్చ్ లు చేస్తే మాత్రం ఫడ్నవీస్ కి ఏమౌతుంది లెండి. 12 న వీరు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి 12,000 మంది పోలీసులను బందోబస్తు పెట్టారులెండి. ప్రస్తుతం నడుస్తున్నది మోడీ యుగం... మోడీ... అమిత్ షా లు పైన ఉన్నంతవరకు ఫడ్నవీస్ కు ఢోకా లేదు... పైన ఎలాగూ మోడీ కి పోటీ లేదు కదా... మొన్న చూశారు కదండీ.. త్రిపుర లో ఎర్ర కోట ను ఎలా బద్దలు చేసారో.. ఆఫ్ట్రాల్ వీళ్ళెంత... మొత్తానికి ఇక్కడ చంద్రబాబు గారి పాలనలో... దేశంలో మోడీ... ఆయన అనుచరుల పాలనలో దేశం ఎక్కడికో వెళ్ళిపోతోంది... ఇక్కడ చంద్రబాబు గారు... అక్కడ మోడీ గారు మనల్ని ఆ విధంగా ముందుకు తీసుకుపోతున్నారహో...
11, మార్చి 2018, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి