మన దేశంలో రైతుల పరిస్థితి ఆ రాష్ర్ట్రం... ఈ రాష్ట్రం అని లేదు... అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉంది. మన రాష్ర్ట్రంలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహారాష్ట్రలో రైతాంగ ఆత్మహత్యల్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేసింది. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు లోనూ ఇదే పరిస్థితి. తమిళనాడు రైతులు గత రెండు వారాలుగా ఢిల్లీ లో జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్నారు. వారికి మద్దతుగా తమిళ సినీ నటులు విశాల్, ప్రకాష్ రాజ్ తదితరులు గత శనివారం ఢిల్లీ లో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ని కలిసి తమిళనాడు లో ఉన్న తీవ్ర కరువు పరిస్థితి దృష్టి లో పెట్టుకుని రైతుల రుణాలు మాఫీ చెయ్యాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి అరుణ్ జైట్లీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మంది పడుతున్నారు. అరుణ్ జైట్లీ తనను కలవడానికి వచ్చిన ప్రముఖ సినీ నటులు విశాల్, ప్రకాష్ రాజ్ లను కనీసం కుర్చీలో కూర్చోమని అనలేదు. వాళ్ళు ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడితే... ఆయన గారు తన సీట్లో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని వినతి పత్రం అందుకున్నారు. వచ్చిన వారిద్దరూ మాములు నటులు కాదు. విశాల్ తమిళనాడు నటి నటుల సంఘానికి అధ్యక్షుడు కూడా. ఇక ప్రకాష్ రాజ్ జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత. అటువంటి ప్రముఖులకు మన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన మర్యాద ఇదీ...
12, మార్చి 2018, సోమవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి