40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగి దేశంలో కెల్లా నేనే సీనియర్ రాజకీయ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు కేవలం 9 ఏళ్ల రాజకీయ చరిత్ర కల జగన్ చేతిలో పదే పదే ఓడిపోతున్నాడు. జగన్ ను నైతికంగా ఎన్నికల ముందే గెలిపించేస్తున్నాడు. జగన్ గత నాలుగేళ్లుగా ఒకటే మాట మీద ఉన్నాడు... ప్రత్యేక హోదా కావాలని... చంద్రబాబు నెల కిందటి వరకు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని, హోదా వద్దు... ప్యాకేజి ముద్దు అని చెప్పడం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు... సడన్ గా యూ టర్న్ తీసుకుని హోదా కావాలని స్వరం మార్చాడు. జగన్ బాట పట్టాడు. తర్వాత వారం కిందట జగన్ అవిశ్వాసం పెడదాం... మీరు పెట్టినా సరే నేను మద్దతు ఇస్తాను... లేదా నేను పెడతాను... మీరు మద్దతు ఇవ్వండి అన్నప్పుడు కూడా అవిశ్వాసం వేస్ట్.. దాని వల్ల ఒరిగేదేమీ లేదు అన్నాడు. ఎన్. డీ. ఏ లోనే ఉండి పోరాడుతా అన్నాడు. సడెన్ గా మళ్ళీ ఇప్పుడు యూ టర్న్ తీసుకుని జగన్ కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని కంగారుపడి తమ పార్టీ తరపున అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. అల్ రెడీ వై.సి.పీ గురువారం నోటీసు ఇచ్చాక, శుక్రవారం టీ డీ పీ ఈ స్టెప్ తీసుకోవడం వై.సి.పీ కి ఒక రకంగా గెలుపే... ఈ విధంగా చంద్రబాబు జగన్ ఇస్తున్న స్ట్రోక్స్ కు రాజకీయంగా మతి భ్రమించి తాను ఏం చేస్తున్నాడో కూడా అర్ధం కాక తడబడుతూ ఎన్నికల ముందే జగన్ ను గెలిపించేస్తున్నాడు.
16, మార్చి 2018, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి