నాడు మద్రాస్ రాష్ట్రంలో కలసి ఉన్న కాలంలో ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తరహాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయనున్నారు. తాను అమాయకులైన విద్యార్థుల, యువకుల ప్రాణాలను బలిపెట్టనని, అవసరమైతే తానే ఆమరణ దీక్ష చేస్తానని జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ ప్రకటించారు కూడా. అయితే ఈ ప్రకటన వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి. తెలుగుదేశం పొలిటికల్ వింగ్ సోషల్ మీడియా లో ఈ కుట్ర గురించి చెప్పిన విషయం చూస్తే వామ్మో... ఏం ప్లాన్ రా బాబు... కళ్ళు బైర్లు కమ్మే ప్లాన్ అని అనిపించక మానదు. అసలు ఆ ప్లాన్ నిజమైతే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మరో పొట్టి శ్రీరాములు లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకునేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ అది. ఇంతకీ తెలుగుదేశం వారు చెబుతున్న ఆ ప్లాన్ ఏమిటంటే...
పవన్ కళ్యాణ్ బీ.జె.పీ డైరెక్షన్ తో మే నెలలో ప్రత్యేక హోదా కోసం అమరావతిలో ఆమరణ దీక్షకు కూర్చుంటాడు. మే దాకా ఎందుకు ఆగారంటారా... అప్పుడైతే స్టూడెంట్స్ కు పరీక్షలు అన్నీ అయిపోయి ఫ్రీ గా ఉంటారు. అప్పుడు మన హీరో పవన్ ఆమరణ దీక్షకు కూర్చుంటారు. వెంటనే పవన్ కు మద్దతుగా స్టూడెంట్స్...( తెలంగాణ లో కే.సి.ఆర్ కు మద్దతుగా ఉస్మానియా స్టూడెంట్స్ తరహాలో) రోడ్డు మీదకు వస్తారు... రోజులు గడిచిన కొద్దీ... పవన్ ఆరోగ్యం క్షీణస్తున్న కొద్దీ స్టూడెంట్స్ ఆందోళన ఉధృతం చేస్తారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభింపచేస్తారు. దెబ్బకు కేంద్రం దిగి వస్తుంది... (కాదు దిగి వచ్చినట్టుగా నటించి... ప్రత్యేక హోదా ప్రకటిస్తుంది. పవన్ తో దీక్ష విరమింపచేస్తుంది. దీంతో పవన్ రాష్ట్ర ప్రజల్లో నిజంగానే హీరో అవుతాడు. ఆ తర్వాత హోదా ఇచ్చినందుకు కృతజ్ఞతగా పవన్ జనసేన బీ.జె.పీ తో పొత్తు పెట్టుకుంటుంది. 2019 ఎన్నికల్లో పవన్, బీ.జే .పీ కూటమి విజయం సాధించి ప్రభుత్వం స్థాపిస్తుంది.... అవసరమైతే జగన్ ను కూడా కలుపుకుని చంద్రబాబును మాత్రం అధికారంలోకి రానీయకుండా చేస్తుంది.
ఇదండీ... తెలుగుదేశం వారు ఆరోపిస్తున్న మహా కుట్ర. చూడబోతే నిజమే ఆని పిస్తుంది. ఎందుకంటే జన సేన మూడు నెలల కిందటే విద్యార్థుల కోసం ప్రత్యక హోదా మా హక్కు... అని రాసి ఉన్న, జనసేన లోగో ఉన్న టీ షర్ట్ లు వేలాది టీ షర్ట్ లు ప్రింట్ చేయించి రెడీగా పెట్టింది. (పైన టీ షర్ట్ ఫోటో ఉంది.చూడగలరు.) అమిత్ షా ప్లాన్ వేస్తే తిరుగుండదు కదా. ఈ ప్లాన్ బయటకు పొక్కే తెలుగుదేశం అర్జెంట్ గా ఎన్.డీ.ఏ నుంచి బయటకు వచ్చేసింది. అంతే కాదు. వెంటనే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు కూడా చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మొత్తానికి పాపం పిచ్చోడు... జగన్ నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తున్నా చంద్రబాబు ను భయపెట్టలేక పోయాడు కానీ అమిత్ షా, పవన్ కలసి బాబు కు ముచ్చెమటలు పోయిస్తున్నారన్న మాట.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి