Translate

  • Latest News

    21, మార్చి 2018, బుధవారం

    టీ.డీ.పీ ఎం.ఎల్.ఏ లకు పక్కలో బల్లేలు



    ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ  స్థానాల్లో దాదాపు 125 చోట్ల ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ఎం.ఎల్.ఏ లు, లేదా కంటెస్టెడ్ ఎం.ఎల్.ఏ లకు పక్కలో బల్లేలు తయారయ్యాయి. ఈ బల్లేలు రెండు రకాలు. మొదటి రకం వేరే పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరిన ఎం.ఎల్.ఏ.లు.  రెండవ రకం. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉండి ... ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న వారు. టీడీపీ ఎం.ఎల్.ఏ లు ప్రస్తుతం వై.సి.పీ నుంచి వచ్చిన నాయకుల కన్నా, తమ పార్టీలోనే ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను చూసే ఎక్కువ భయపడుతున్నారు. ఎందుకంటే ఈ నాలుగేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ ఎం.ఎల్.ఏ లతో పాటు  ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వందల కోట్లు సంపాదించారు. ఇప్పుడు వారు పార్టీలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి వారంతా లోకేష్ బాబుతో డైరెక్టుగా కనెక్షన్ పెట్టుకున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గం లేను చంద్రబాబు బ్యాచ్ కు సమాంతరంగా లోకేష్ బ్యాచ్ ఒకటి తయారయింది. ఈ లోకేష్ బ్యాచ్ తో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కు తలనొప్పి ఖాయం.  దీనికి తోడు చంద్రబాబు ఎం.ఎల్.ఏ లు, మంత్రులకు నెల నెల మార్కులు వేయడం, తక్కువ మార్కులు వచ్చిన వారిని హెచ్చరిస్తుండడంతో ఎం.ఎల్.ఏ లు, మంత్రులకు గుండెల్లో దడ పట్టుకుంది. ఈ ప్రభావం రేపు పార్టీ టికెట్ మీద పడి, టికెట్ చేజారిపోతుందేమోనని ఆందోళన మొదలైనది. తమకు ప్రత్యామ్నాయంగా ఒక వైపు ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చి చేరిన వారు, మరో వైపు సొంత పార్టీ లోనే నిన్నటి వరకు తమ చుట్టూ తిరిగిన నాయకులే ఇప్పుడు తమకు పోటీగా తయారవడంతో వాళ్లకు రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు. పక్కలో బల్లేలు ఉంటె నిద్ర ఎలా పడుతుంది..? ఇదండీ సంగతి. పాపం టీడీపీ ఎం.ఎల్.ఏలు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: టీ.డీ.పీ ఎం.ఎల్.ఏ లకు పక్కలో బల్లేలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top