Translate

  • Latest News

    9, ఏప్రిల్ 2018, సోమవారం

    తమిళ తంబీలను చూసైనా బుద్ధి తెచ్చుకోండి...


    పురాణాలు... పుక్కిటి పురాణాలని కొట్టిపారేసినా ... అందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి సుమా... పాండవులు ఐదుగురు...కౌరవులు 100 మంది...వారికీ... వీరికీ... ఎప్పుడూ పడదు... కానీ... వేరెవరైనా బయటవాళ్ళు వీరి పైకి దండెత్తి వస్తే.. వీరు 105 మంది... అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ సిద్దాంతాన్ని తూ.చా తప్పకుండా పాటిస్తారు మన పక్కనున్న తమిళ తంబీలు...మన దేశానికి  స్వాతంత్ర్యం వచ్చాక కూడా 1953 దాకా మనం మద్రాస్ రాష్ట్రంలోనే కలసి ఉన్నాం. కానీ... వారి నుంచి ఈ మంచి గుణాన్ని మాత్రం నేర్చుకోలేక పోయాం. ఇది గతంలో అనేకసార్లు రుజువయింది. ఇప్పడు తెలుగు జాతి తల  వంచి సిగ్గుపడేలా... ఢిల్లీ వీధుల్లో మరోసారి మన అనైక్యతను గొప్పగా...చాటుకుంటున్నారు.. 
    మరో పక్క కావేరి సమస్యపై ఎవరేమనుకున్నా సరే.. మా ప్రయోజనాలే మాకు ముఖ్యమంటూ పార్లమెంట్లో అన్నా  డి.ఎం.కె  ఎం.పీ లు నిరాటంకంగా ఆందోళన చేశారు. పార్లమెంట్ వెలుపల కూడా తమిళనాడులో అన్ని పార్టీలు... ఆఖరికి నిన్న, మొన్న పుట్టిన కొత్త పార్టీలు సైతం.. ఒక తాటి పైకి వచ్చి కావేరి సమస్యపై ఆందోళనకు తమ సంఘీభావం ప్రకటించాయి. సైద్దాంతిక విభేదాల కారణంగా కలసి పనిచేయలేమని చెప్పి వేర్వేరు పార్టీలు పెట్టుకున్న కమల్ హాసన్, రజనీకాంత్ కూడా కావేరి సమస్యపై ఒకే వేదిక పంచుకున్నారు... కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని కోలీవుడ్ పరిశ్రమ ఆదివారం నిర్వహించిన మౌన దీక్షలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ దీక్షలో తమిళ నటులు విజయ్, సూర్య, విశాల్, శింబు, ధనుష్ తదితర తమిళ్ నటులు కూడా పాల్గొన్నారు.  
    మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఆందోళనలో ఎవరి దారి వారిదే.. వై.సి.పీ ఎం.పీ లు ఆమరణ దీక్షకు కూర్చుని ఉద్యమాన్ని ఒక రేంజ్ కి తీసుకువెళ్లినా ఆ క్రెడిట్ ఆ పార్టీకి వస్తుందనే దుగ్దతో తెలుగుదేశం పార్టీ వేరేగా తూ.తూ  మంత్రంగా ఆందోళనలు చేస్తోంది. జనసేన, కమ్యూనిస్టులు కలసి వేరే ముఠాగా ఆందోళన చేస్తున్నాయి. విడివిడిగా ఆందోళనలు చేసి ఊరుకుంటున్నారా... ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ.. మన తెలుగు జాతి పరువును గంగలో కలుపుతున్నారు... కాదు..కాదు.. తీసుకెళ్లి ఏకంగా నయాగరా జలపాతంలో పడేస్తున్నారు... ఛీ.. ఛీ ... వీళ్ళెప్పుడు బాగుపడతారు... తమిళ తంబిల నుంచి ఎప్పుడు నేర్చుకుంటారు.. నాకయితే నమ్మకం లేదు... మరి మీకు.... 
    -మానవేంద్ర  
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తమిళ తంబీలను చూసైనా బుద్ధి తెచ్చుకోండి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top