మాట్లాడితే నేను నిప్పు... అని చెప్పుకునే చంద్రబాబుకు అంత భయమెందుకో మరి. పాపం ఈ మధ్య చంద్రబాబు తన నీడను చూసి తానె భయపడుతున్నారు. నిద్రలో ఉలిక్కి పడుతున్నారు... కలవరిస్తున్నారు... పలవరిస్తున్నారు. ఆయన నోటి నుంచి పదే ...పదే ... ఒకటే మాట... ఏదో జరుగుతోంది... కేంద్రంలో ఉన్న బి.జె.పీ, రాష్ట్రంలో ఉన్న వై.సి.పీ కలసి నాపై కుట్ర పన్ని... నన్నేదో చేయాలని చూస్తున్నారు అని... అదిగో... వాళ్ల్లు వాళ్ళను కలిశారు...వీళ్ళెళ్ళి వాళ్ళను కలిశారు... వాళ్ళు...వీళ్లు అంతా నా గురించే ఎదో కుట్రలు చేస్తున్నారు... నన్నేదో చేయాలని చూస్తున్నారు... ప్రజలే నాకు రక్షణ కవచంలా నిలబడాలి. ప్రజలే నన్ను కాపాడుకోవాలి... అంటూ సంధి ప్రేలాపనలు పేలుతున్నారు. నిజంగా నిప్పు అయితే...అంతగా భయపడడం ఎందుకు... ఏ తప్పు చేయని వాడు ఎందుకు భయపడాలి. నిప్పుకు కూడా తుప్పు పట్టిందా... అనే అనుమానం ప్రజలకు రాకుండా ఉండదు. మరి గతంలో తనకు బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ తో చేతులు కలిపి జగన్ పై తప్పుడు కేసులు పెట్టించినపుడు... జగన్ నీలాగా బేలగా భయపడలేదే... నీ మాట ప్రకారం జగన్ లక్ష కోట్లు తిన్నాడు... మరి నువ్వు నిప్పు కదా... నువ్వేందుకు భయపడుతున్నావ్ బాబు... ఏ తప్పు చేయని వాడివి నీ కెందుకంత భయం బాబూ... ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్నట్టు చంద్రబాబు రజో సర్ప బ్రాఅంతి తో భయపడుతున్నట్టు ఉన్నాడేమో...
వెనకటికి మహాభారతంలో కురువంశం లో చిట్టచివరి రాజైన పరీక్షిత్తు మహారాజు సర్ప హత్య మహాపాతకం నుంచి తప్పించుకోవడానికి ఒంటి స్థంభం మేడ పైన కూర్చున్నా చివరకు భటులు ఆయనకు తెచ్చిన పండ్లలో దూరి సర్పం ఆయన మందిరం లోకి ప్రవేశించి ఆయన్ను కాటేసి చంపేసింది. అలాగే తప్పు చేసిన వాడు.. తాత్కాలికంగా అధికార రక్షణ కవచమో ... లేక ప్రజా రక్షణ కవచమో ఇలాంటి ఎన్ని రక్షణ కవచాలు అడ్డు పెట్టుకున్నా చివరకు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి