అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఈ సారి ఓ అయిదారు నెలలు ముందుగానే వచ్చే అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. అంటే 2019 ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లోనే రానున్నాయి. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 డిసెంబర్ లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇందిర హత్య సానుభూతితో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 425 ఎం.పీ స్థానాలు గెలుచుకుంది. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే దేశమంతా ఇందిర సానుభూతి పవనాలు వీచి కాంగ్రెస్ గెలవగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 1984 ఆగస్టు లో ఎన్టీఆర్ ను అప్రజాస్వామికంగా పడదోసిందన్న కక్షతో కాంగ్రెస్ పార్టీని కసి తీరా ఓడించారు. ఆ ఎన్నికల్లో 30 ఎం.పీ సీట్లు గెలుచుకోవడంతో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందింది. కాంగ్రెస్ కు కేవలం 6 సీట్లే లభించాయి. ఇప్పడు కూడా రాష్ట్రంలో మళ్ళీ అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడానికి ఈ ఎన్నికలే కీలకం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నది బి.జె.పీ...ప్రత్యేక హోదా హామీ తుంగలో తొక్కింది బి.జె.పీ... ప్రస్తుతం రాష్ట్ర ప్రజల కోపం కాంగ్రెస్ మీద నుంచి బి.జె.పీ మీదకు డైవర్ట్ అయింది. ఒక రకంగా కేంద్రంలో అది కాంగ్రెస్ కు లాభదాయకం. మరి రాష్ర్ట్రంలో లాభపడేది ఎవరు. ప్రత్యేక హోదా అంశంతో లాభపడేది ఎవరు తెలుగుదేశం పార్టీయా... వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీయా... ప్రజల మనస్సులో ఏ పార్టీపై అభిమానము ఉంది. తెలుగుదేశం పార్టీ అనుంగు పుత్రిక ఆంధ్ర జ్యోతి ఆదివారం ప్రచురించిన సర్వే లో తెలుగుదేశం పార్టీ కి 110 సీట్లు వస్తాయని పేర్కొంది. లగడపాటి రాజగోపాల్ కి సర్వే చేయించే ఆర్జీఎస్ తో ఆ సర్వే చేయించినట్టు తెలిపింది. ఎన్నికల లోపు ఇలాంటి సర్వేలు ఇంకా చాలా వస్తాయి. అవన్నీ కూడా ఒక దానికి ఇంకో దానికి పోలికలు ఉండక పోవచ్చు. తటస్థ ఓటర్ల మనసులను చెదరగొట్టి... వారి ఓట్లు కొల్లగొట్టడానికి ఇలాంటి సర్వేలు ఎన్నో వస్తాయి. సర్వేలను చూసి మోసపోవద్దు సుమా...
18, జూన్ 2018, సోమవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి