Translate

  • Latest News

    7, జూన్ 2018, గురువారం

    వ‌ర్షాకాలం జాగ్ర‌త్త‌..


    వర్షకాలంలో ఆహారంపట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ఆహారం సులభంగా ఫంగస్‌కు ప్రభావితమవుతుంది. అందుచేత తక్కువ పరిమాణంలో ఆహారాన్ని వండుకోవాలి. అలాగే వండిన ఆహారంలో బాక్టీరియా చేరకుండా రెండు గంటలకోసారి మూతతీసి కలుపుతూ ఉండాలి. చపాతీలు నాచుపట్టకుండా సిల్వర్‌ఫాయిల్‌ పేపర్‌తో చుట్టాలి. ఆహార పదార్థాలను నిల్వ ఉంచినపుడు తప్పనిసరిగా మూతలు ఉండాలి. ఎప్పటికప్పుడు వేడి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఫంగస్‌ నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.


    వర్షకాలం వచ్చిందంటే రోడ్డు పక్కన... చెట్ల కింద వేడివేడిగా తయారు చేస్తున్న ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంది. అయితే ఏం తినాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఏదో ఒకటి తినేస్తాం దీని వల్ల త్వరగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కావున జిహ్వకోరు రుచులనే కాదు.. ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కావున జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. బాగా వేయించిన నూనె ఎక్కువగా వాడిన పదార్థాలు తింటే అవి త్వరగా ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. జీర్ణం కావడం కష్టంగా మారుతుందితాజా కూరగాయలు, తాజా పండ్ల రసాలు, నిప్పుల మీద కాల్చి చేసిన వంటకాలు, తందూరీ పుల్కాలు. గోరువెచ్చని నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బయట తిండికి గుడ్‌బై చెప్పి రోజూ గోరువెచ్చని నీటిని తాగుతుండాలి. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలను వేడిచేసుకుని తినే అలవాటును మార్చుకోవాలి. పదార్థాలపై మూతలు తప్పనిసరి. ఇంట్లో చెత్తను ఎప్పటికప్పుడు బయట పడేయాలి. ఇంట్లో లోపల నేలని ఫినాయిల్‌తో తరుచూ శుభ్రం చేస్తుండాలి. వర్షకాలంలో ఈ రకమైన జాగ్రత్తలు పాటించటం వల్ల అంటువ్యాధులు దరి చేరవని డాక్టర్లు చెబుతున్నారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వ‌ర్షాకాలం జాగ్ర‌త్త‌.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top