చర్చల్లో,వాదనలలో బలం లేనివారే చర్చను పక్కదారి పట్టిస్తారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయటం సబుబే. కాని ఆ విమర్శలు హుందాగా ఉండాలి. ఏదైనా అంశంపై విమర్శ చేసేటప్పుడు ఆ అంశంపైనే చర్చ జరగాలి. కాని గత కొంత కాలంగా చంద్రబాబు కంట్రోల్ తప్పుతున్నారు. జగన్‌పై , బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్నారు. సరే వ్యూహం ప్రకారం తమ తప్పిదాలు కప్పిపుచ్చుకొనేందుకు బీజేపీని టార్గెట్ చేసేరంటే అర్ధం ఉంది. కాని 40 సంవత్సరాల సుధీర్ఘ అనుభవం కలిగి చంద్రబాబు నేరుగా జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. జగన్ ఆస్తులకు సంబంధించి మాట్లాడిన మాట్లాడిన మాటలు జగన్‌పై ఉన్న ద్వేషాన్ని తెలియజేశాయి. గతంలో జగన్ కూడా చంద్రబాబును ఉరితీయాలి.. కాల్చిచంపాలని మాట్లాడిన సందర్బంలోనూ విమర్శల పాలయ్యాడు. అనుభవం ఉన్న చంద్రబాబు కూడా జగన్‌మాదిరి మాట్లాడటం సరికాదన్న విషయం ఇప్పటికే తెలిసి వచ్చినట్లుంది.
ఎన్ని చెప్పుకున్నా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మాటల యుద్దం ముదురుతోంది. గతంలో సై అంటే సై అనుకొన్న కొంతమంది నేతల సిగపట్లు పోలీసులకు పరీక్షగా మారాయి. సరే మాట తూలి నాయకులు ఏదైనా మాట్లాడినా సరే చేసే యంత్రాంగం ఉంది. నేరుగా ఆయా నాయకులు అన్న మాటలను యధావిదిగా ప్రజలకు చేరకుండా ఎడిట్ చేసే అవకాశం ఉంది. కాని మీడియా, పత్రికలు ఈ విషయాన్ని విస్మరించాయి. మీడియా అయితే ఏకంగా బూతుల పంచాగంపై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రేటింగ్ పెంచుకోవటానికి సిద్దమౌతుంది. రెండు పార్టీల నాయకులను పిలిపించి వారి అధినేతలను తిట్టించి మరి పంపుతోంది.
ఇటీవల ఒక ఛానల్ లైవ్ చర్చ వేదికలో ఇరుపార్టీలకు చెందిన నాయకులు బాహాబాహికి పాల్పడ్డారు. ఆ ఛానల్ ప్రతినిధి కూడా వారిని కనీసం విడిపించే ప్రయత్నం చేయకుండా వేడుక చూసినట్లు చూడటం విమర్శలకు కారణమైంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చల ద్వారా ,వేదికల ద్వారా తమ పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవచ్చు. ప్రత్యర్ధి పార్టీపై విమర్శలు కూడా హుందా ఉండాలి. ఆ విమర్శలకు, ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రత్యర్ధి పార్టీపై ఉంటుంది. కాని ఇదంతా జరుగుతుందా... అశించటం తప్పుకాదు..?
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి