హైకోర్టు బంతి ఇప్పుడు ఏపీ చేతుల్లోనే ఉంది... ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు బాధ్యత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ దే నని, దానికి అవసరమైన ఆర్ధిక వనరులు సమకూర్చే అంశం తమ పరిధిలో లేదని కేంద్ర న్యాయ శాఖ సుప్రీం కోర్టు కు ఇచ్చిన వివరణలో స్పష్టం చేసింది. విభజన సమస్యలపై తెలంగాణ కు చెందిన కాంగ్రెస్ ఎం.ఎల్.సి పొంగులేటి సుధాకరరెడ్డి దాఖలు చేసిన కేసులో కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు 50 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది.
విభజన చట్టం లోని నిబంధనల ప్రకారం కోర్ట్ భవనాలు, న్యాయమూర్తుల అధికారిక భవనాలు, అధికారులు, సిబ్బంది క్వార్టర్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన చోటే ఏర్పాటు చేయాలి. మౌలిక వసతుల కల్పన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అవసరమైన మౌలిక వసతులు అన్నీ అందుబాటులోకి తెచ్చి, అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెబితే చట్టబద్ధంగా అవసరమైన నోటిఫికేషన్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తమ పూర్తి స్థాయి సంసిద్ధతపై కేంద్రానికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇదీ కేంద్ర న్యాయ శాఖ సమర్పించిన అఫిడవిట్ లో ప్రధాన సారాంశం.
సో... ఇప్పుడు తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం... హైకోర్టు భవనం అమరావతి లో నిర్మాణం చేయించడానికి చంద్రబాబు బ్రిటిష్ అర్చిటెక్చర్ నార్మన్ ఫోస్టర్ తో రకరకాల డిజైన్లు గీయించారు. మరోవైపు హైకోర్టు ను రాయలసీమలో ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసుల నుంచి ఆందోళన స్వరాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... ఈ అంశం ఎన్నికల లోపు తేలేది కాదు. ప్రస్తుతం ఉన్న చాలా సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల దాకా డిజైన్ల పేరుతొ సాగదీసి, ఎన్నికలలో మళ్ళీ గెలిచాక అప్పడు వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి