విశాఖపట్నంలో శుక్రవారం కేంద్ర జలవనరులు, జాతీయ రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రసవత్తర నాటకం నడిపించారు. 6,688 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో విభేధించాం.. తప్ప వ్యక్తిగతంగా తనకు ఏ ఒక్క రాజకీయ నాయకుడి పైనా వ్యతిరేకత లేదని విన్నవించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే పనులు జరగవని గ్రహించాలి. కేంద్రం కోరిన అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయి. వాటిని సోమవారమే సమర్పిస్తాం అని చెప్పారు.
కేంద్ర మంత్రి గడ్కరీ సార్ ఏమో... ఏ.పీ ఎప్పుడూ మాకు ప్రత్యేక రాష్ట్రమే... నవ్యఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. ఏ.పీ కి చెందిన 70 శాతం సమస్యలన్నీ నా శాఖల పరిధిలోనే ఉన్నాయి. తప్పకుండా వాటిని పరిష్కరిస్తాం. అని సెలవిచ్చారు.
ఆహా... ఏమి నాటకం... మరి ఇన్నాళ్లు మీరు ఒకళ్లపై ఒకళ్ళు కారాలు..మిరియాలు నూరుకోవడం... నిరసనలు...ధర్నాలు...ధర్మ పోరాట దీక్షలు చేయడం అంతా డ్రామా లే కదా... మధ్యలో ఏ.పీ ప్రజలే వెర్రివాళ్ళు.. అంతే కదా.... మీ దృష్టిలో ప్రజలంటే ఓటర్లు...ఓటర్లు వెర్రివాళ్ళు...గొర్రెల మంద అనే కదా...మీ ఉద్దేశం.
ఇక హైదరాబాద్ లో అమిత్ షా మరో నాటకం. విశిష్ట సంపర్క్ పేరుతొ తటస్థులను కలిసే ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ లో అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీ కి స్వయంగా వెళ్లి ఈనాడు రామోజీ రావు తో ఆంతరంగిక సమావేశం. తోడు వచ్చిన బి.జె.పీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ లతో కలసి కొద్దిసేపు పబ్లిక్ గా మాట్లాడాక, రామోజీ, అమిత్ షా దాదాపు గంట సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారని వినికిడి.
మరో పక్క ఢిల్లీ లో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో పునప్రవేశ నాటకం. విలేకర్లు ఆయన తమ్ముడి గురించి అడిగితే నేను వెళ్లవద్దన్నా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు. ఆయన వ్యక్తిగత నిర్ణయంతో టి.డి.పీ లోకి వెళ్ళాడు అని సెలవిచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జగన్ మన టార్గెట్ అని చెప్పాడట. కాంగ్రెస్ కి ఏ.పీ లో చంద్రబాబు టార్గెట్ కాదట... జగనే టార్గెట్ అట... ఆహా...ఏమి నాటకం...
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర రాజకీయ తెర మీద ఎన్నెన్ని నాటకాలు... ప్రజలే ప్రేక్షక దేవుళ్ళు... ఈ ప్రేక్షక దేవుళ్ళు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి మరి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి