మలయాళ సినిమా రంగం పట్ల ఓ సానుకూల అభిప్రాయం ఉండేది. వాస్తవిక దృక్పధంతో సినిమాలు తీస్తారని. మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి ఉత్తమ నటులు ఉన్నారని... కానీ దిలీప్ లాంటి మృగానికి అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)లో మళ్ళీ సభ్యత్వం ఇవ్వడం ఆ పరిశ్రమ పైన, దానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ పైన ఆగ్రహం తెప్పిస్తోంది. దిలీప్ మలయాళంలో పెద్ద హీరో కావచ్చు. కానీ అతను చేసిన పని... తోటి నటి, హీరోయిన్ భావన ను ఓ షూటింగ్ స్పాట్ నుంచి కిడ్నాప్ చేసి, లైయంగిక వేధింపులకు గురి చేయడం క్షమార్హం కాదు. ఆ సంఘటనను ఎంతో దేర్యంగా ఎదుర్కోవడమే కాక, తనపై జరిగిన అకృత్యాన్ని పబ్లిక్ గా చెప్పిన భావన నిజంగా అభినందనీయురాలు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో దిలీప్ కు అమ్మ సభ్యత్వం తొలగించారు. కాలం గడిచింది... వ్యవహారం సద్దుమణిగిందనుకున్నారో ఏమో... మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉన్న అమ్మ లో దిలీప్ కు మళ్లీ సభ్యత్వం పునరుద్ధరించారు. ఈ నిర్ణయం పై మలయాళ సినీ పరిశ్రమ నుంచే కాక దక్షిణాది సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనది. భావనతో సహా పలువురు నటీమణులు బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా అమ్మ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాడు. చట్టపరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికీ సభ్యత్వం ఇవ్వడం తప్పు అని చెప్పాడు. అయితే మిగతా చిత్ర పరిశ్రమలతో పోలిస్తే మలయాళ చిత్ర పరిశ్రమలో లింగ వివక్ష తక్కువే అని ఆయన అభిప్రాయపడ్డారు.
15, జులై 2018, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి