Translate

  • Latest News

    15, జులై 2018, ఆదివారం

    ఈశాన్యంలో విరిసిన నల్ల కలువ



    ఈశాన్యంలో  నల్ల కలువ విరిసింది. అవును. భారత దేశంలో ఈశాన్య రాష్ట్రాలుగా, 7 సిస్టర్స్ గా  (అసోం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, అరుణాచలప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం) మనం ముద్దుగా పిలుచుకునే వాటిలో పెద్దక్క లాంటి అసోం లో ఆ నల్ల కలువ ఉదయించింది. కష్టాల కొలిమిలో రాటుదేలిన వజ్రాయుధం ఆమె. గత కొంత కాలంగా అంతర్జాతీయ క్రీడావేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న వారిలో 90 శాతం మంది ఆడ పిల్లలే... ఇప్పుడు భరత మాత  కన్న మరో ముద్దుల పుత్రిక  హిమా దాస్. భరత మాత సిగలో విరిసిన నల్ల కలువ. 
    అసోం లోని నగావ్ జిల్లా థింగ్ గ్రామానికి చెందిన 18 ఏళ్ళ హిమా దాస్ ఇంటర్నేషనల్ అమెచ్యూర్ ఆధ్లేటిక్స్ ఫెడరేషన్ వరల్డ్ అండర్ 20 ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకాన్ని గెలుపొంది ట్రాక్ ఈవెంట్ లో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం గెలిచిన తోలి భారతీయ ఆధ్లెట్ గా చరిత్ర సృష్టించింది. ఇంతటి ఘనత కేవలం రెండేళ్ల కాలంలో సాధించడం మరీ విశేషం. ఎందుకంటే ఆమె తొలుత ఫుట్ బాల్ ఆటపై మక్కువతో కొన్నాళ్ళు ఫుట్ బాల్ ఆడింది. కేవలం 2016 లోనే తన ఇంట్రెస్ట్ రన్నింగ్ మీదకు మార్చుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన హిమా దాస్ తండ్రి రైతు కావడంతో పొలమే ఆమెకు ట్రాక్ అయింది. ఎత్తు పల్లాలతో కూడుకున్న పొలంలో నేలమీద పరుగు తీసి...తీసి... రాటుదేలిన కాళ్లు అవి. అందుకే... ట్రాక్ పై అడుగుపెడుతూనే సంచలనాలు సృష్టించింది. తొలిగా ఓ రాష్ట్ర స్థాయి పోటీలో ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ నిప్పన్ దాస్ ఆ కుగ్రామంలో ఉంటె ఆమె ప్రతిభ మరుగున పడిపోతుందని ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను గత ఏడాది అక్కడికి 140 కి.మీ. దూరంలో ఉన్న అసోం రాజధాని గువాహటి కి తీసుకువచ్చాడు. అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హాస్టల్ లో చేర్పించాడు. 100, 200 మీ. రన్నింగ్ లో అదరగొట్టిన హిమను 400 మీ. కు మార్చారు. 400 మీ. లో  హిమ వ్యక్తిగత అత్యుత్తమం 51.13 సెకన్లు. (గత ఏడాది గువహతి లో జరిగిన ఇంటర్ స్టేట్ ఛాంపియన్ షిప్ లో) చరిత్ర సృష్టించిన నిన్నటి అంతర్జాతీయ పోటీలో 400 మీ. ల రన్నింగ్ రేస్ లో 51.46 సెకన్ల లో పరుగెత్తి స్వర్ణ పతకం సాధించింది. ఇంతటి ఘనత సాధించిన ఆమెను పొగడక పోగా ఇంగ్లీష్ సరిగా రాదని సోషల్ మీడియా లో కామెంట్ చేసిన వెధవల్ని ఏమనాలి..?
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఈశాన్యంలో విరిసిన నల్ల కలువ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top