ప్రేమ కోసమై వలలో పడెనే...పాపం పసివాడు... అయ్యో... పాపం పసివాడు... అన్నట్టు అయింది చంద్రబాబు పరిస్థితి. మోడీపై ప్రేమను చంపుకోలేక... జగన్ పన్నిన వలలో చిక్కుకున్నాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నారా చంద్రబాబు నాయుడు మరోసారి వై.ఎస్ జగన్మోహనరెడ్డి పన్నిన వలలో చిక్కి గిలగిలా కొట్టుకుంటున్నాడు. కేంద్రంలో ఉన్న బి.జె.పీ తో పైకి కటీఫ్ చెప్పి... లోపాయికారిగా కధ నడిపిస్తున్న చంద్రబాబు గత వారం పార్లమెంట్ లో బి.జె.పీ తో కలసి అవిశ్వాస తీర్మానం నాటకం వేసి అభాసుపాలయ్యారు. ఢిల్లీలో ఆంగ్ల పత్రికల విలేకరుల ముందు కూడా నవ్వులపాలయ్యారు. చంద్రబాబు రెండేళ్ల కిందట ఢిల్లీ వచ్చి ఏమి మాట్లాడారో... ఇప్పుడేమి మాట్లాడుతున్నారో చూసి ఢిల్లీ జర్నలిస్టులు బాబును ఒక పొలిటికల్ జోకర్ గా పరిగణించి... పట్టించుకోవడం మానేశారు. తెలుగు మీడియా ను కుల గజ్జితో కట్టి పడేయవచ్చు... కానీ... ఇంగ్లీష్ మీడియాను గుప్పెట్లో పెట్టుకోవడం కుదరదు కదా...
పాదయాత్రలో ఉండే... రాష్ట్ర,దేశ రాజకీయాల్ని నిశితంగా గమనిస్తూ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న జగన్ చంద్రబాబు అవిశ్వాస నాటకం అనంతరం చంద్రబాబు నాటకాన్ని ప్రజల ముందు బట్టబయలు చేయడానికే వెంటనే బంద్ పిలుపు ఇచ్చాడు. జగన్ పిలుపు ఇస్తే చంద్రబాబు ఎలాగూ సపోర్ట్ చేయడు. పైగా విఫలం చేయడానికే ప్రయత్నిస్తాడు. ఈ విషయం జగన్ కు బాగా తెలుసు కాబట్టే... తెలివిగా బంద్ పిలుపు ఇచ్చాడు. జగన్ ఊహించినట్టే చంద్రబాబు జగన్ వలలో చిక్కుకున్నాడు. వై.ఎస్.ఆర్.సి.పీ బంద్ పై ఉక్కుపాదం మోపాడు. హౌస్ అరెస్టులు... నాయకులను, మహిళలను కూడా ఈడ్చి పారేసి అరెస్టులు చేయడం. పోలీసులతో బల ప్రయోగం చేయించడం... ఇవన్నీ జగన్ అనుకున్నట్టు గానే చంద్రబాబు నడుచుకుని మరోసారి జగన్ ఉచ్చులో పడ్డాడు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న బంద్ ను అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు పరోక్షంగా హోదా ఉద్యమాన్ని వ్యతిరేకించినట్టే... ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయడానికే జగన్ బంద్ పిలుపు ఇచ్చి చంద్రబాబు నిజ స్వరూపాన్ని మరోసారి ప్రజలకు బట్టబయలు చేసాడు. పాపం... చంద్రబాబు... చివరకు ప్రజల దృష్టిలో ఒక పొలిటికల్ జోకర్ గా మిగిలిపోతాడేమో...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి