Translate

  • Latest News

    11, సెప్టెంబర్ 2018, మంగళవారం

    సంతృప్తి...అసంతృప్తి...


    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనపై ప్రజల నుంచి ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సర్వే చేయించుకుంటూ... తన పాలనపై... ప్రభుత్వ పధకాలపై ప్రజలు 80 శాతం  సంతృప్తి గా ఉన్నారని, ప్రతిపక్షాలు ఎంత యాగీ చేసినా మళ్ళీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని విశ్వసిస్తూ ఉన్నారు. అందుకే జగన్ పాదయాత్రకు జనం తండోపతండాలుగా వస్తున్నా పట్టించుకోలేదు. కృష్ణాజిల్లాలో ఎంటర్ అయ్యేటప్పుడు కనకదుర్గ వారధి కంపించినపుడు... ఒక్క క్షణం చంద్రబాబు గుండె వేగం పెరిగినా... నంద్యాల ఎన్నికను ఒక్కసారి గుర్తుచేసుకుని ధీమాగా ఉన్నారు. ఆ తర్వాత ప.గో జిల్లా నుంచి తూ.గో. జిల్లాలో అడుగుపెడుతున్నప్పుడు ధవళేశ్వరం బ్రిడ్జి దద్దరిల్లినా చంద్రబాబు డోంట్ కేర్ అన్నారు... మరి ఇప్పుడు విశాఖలో కంచరపాలెం సభకు వచ్చిన జనాల్ని చూసి ఎందుకు కంగారు పడుతున్నారు... విజయమ్మను ఓడించిన విశాఖలో.... జగన్ కు అంతమంది జనాలు ఎలా వచ్చారనా ... గత ఎన్నికల్లో విజయమ్మను గెలిపిస్తే కడప రౌడీలు వచ్చి విశాఖలో మన ఇళ్ళు, పొలాలు ఆక్రమించుకుని మనల్ని తన్ని తరిమేస్తారని...  రాయలసీమ బూచి చూపించి రెచ్చగొడితే పాపం అమాయక ఉత్తరాంధ్ర జనాలు నిజమే కాబోలు అనుకుని నమ్మి... విజయమ్మను ఓడించేశారు. ఈ నాలుగేళ్లలో ఎవరు...ఎవరి భూముల్ని లాక్కున్నారో... దోచుకున్నారో... ప్రజలు కళ్లారా చూశారు. ఉత్తరాంధ్ర జనాలు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలంత తెలివిగల వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరిని నమ్మితే వాళ్ళకే కట్టకట్టుకుని ఓట్లేసి అందలం ఎక్కిస్తారు. అదే చంద్రబాబు భయం... ఈ సారి... తనను నమ్మరేమో... జగన్ ను నమ్మి గెలిపిస్తారేమోనని భయం... అందుకే కంచరపాలెం జనాల్ని చూసి కంగారు... వెంటనే ఆయనకు తన సిబ్బంది చేసే ఫోన్ సర్వే గుర్తొచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై మీరు సంతృప్తిగా ఉన్నారా... అంటూ పదే... పదే ... ప్రజలకు ఫోన్లు చేసి విసిగిస్తూ... సర్వే చేసి ప్రజలు 80 శాతం సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలు... అవి చూసి సంతృప్తి పడి  చంద్రబాబు ధీమాగా ఉన్నారు. ఇప్పుడు జగన్ కు వచ్చిన జనాలను చూసి... ఈ సంతృప్తి సర్వేల మీద సంబంధిత అధికారులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వివిధ మార్గాల ద్వారా వాస్తవ నివేదికలు తెప్పించుకుని అధికారులపై ధూమ్...ధామ్... అంటూ చిర్రుబుర్రు లాడినట్టు సమాచారం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సంతృప్తి...అసంతృప్తి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top