హమ్మయ్య... ముసుగులు తొలగిపోయాయి. ఇన్నాళ్లు రకరకాల ముసుగులు వేసుకుని మన ముందు డ్రామాలాడిన వివిధ పార్టీల నాయకులు... ఎన్నికలు దగ్గరపడేసరికి... ముసుగులు తొలగించి తమ నిజరూపదర్శనం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముక్తి మార్గం ప్రసాదించారు. అందుకు ప్రజలు వారికెంతో రుణపడి ఉంటారు. ప్రజలకు ఇప్పుడు తమ గమ్యం ఎటువైపో స్పష్టంగా అర్ధమైనది. ఆ విధంగా దిశానిర్దేశం చేసిన నాయకులకు వేల వేల దండాలు... పోయినసారి కలసి పోటీ చేసినా...ఈ సారి విడివిడిగా పోటీ చేసినా మేమంతా ఒకటే అన్న విషయం సుస్పష్టంగా తెలియచేసి... మా కళ్ళు తెరిపించినందుకు మీకు కోటానుకోట్ల ధన్యవాదాలు సర్... మాకు ఇప్పుడు ఒక విషయం క్లియర్ గా అర్ధమైనది సర్... ఎటువంటి ముసుగులు తొడుక్కోకుండా... మొదటి నుంచి...ఎవరితోనూ కలవకుండా... ఒకే ఒక్కడుగా... పోటీ చేస్తున్న దమ్మున్న మొనగాడే మన హీరో అనేది ప్రజలందరికీ దిశానిర్దేశం అయింది. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్, టి.డి.పీ ల మధ్య జరిగిన స్నేహ పూర్వక పోటీ లాగానే... ఈసారి టి.డి.పీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సీపీఎం ల మధ్య జరుగుతోందని మాకు చెప్పకనే చెప్పారు. నర్సాపురంలో నాగబాబును గెలిపించడం కోసం కొత్తపల్లి సుబ్బారాయుడుని పక్కన పెట్టిన చంద్రబాబు గారు త్యాగంలో కర్ణుడిని మించిపోయారు. గుంటూరు వెస్ట్ మీ సామాజికవర్గానికి పెట్టని కోట అనేది అందరికి తెలుసు... అక్కడ మీ కులపోళ్ళు అరడజను మంది టిక్కెట్ కోసం పోటీ పడినా... అక్కడ పవన్ ప్రియ మిత్రుడు తోట చంద్రశేఖర్ ను గెలిపించడం కోసం మీ వాళ్ళందరిని పక్కన పెట్టి, పోయిన సారి గుంటూరు ఈస్ట్ లో పోటీ చేసి ఓడిపోయిన ఆర్య వైశ్య కులానికి చెందిన మద్దాలి గిరిని బలి పశువుగా నిలబెట్టిన మీ త్యాగ నిరతిని కొనియాడడానికి నాకు మాటలు రావడం లేదు. ఇక అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ని గెలిపించడానికి అక్కడ మీ పార్టీ తరపున డమ్మీ కాండేట్ ను పెట్టారట కదా సర్.... ఏదయినా.... రాజకీయం అంటే మీ దగ్గర నేర్చుకోవాలి సర్... బాబు గారు 2019 ఏప్రిల్ 20 కి అంటే ... ఇంకో నెల రోజుల్లో మీరు 69 ఏళ్ళు నిండి 70 లోకి అడుగుపెడుతున్నారు కదా... మీరు ఇంకా కష్టపడటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు సర్. రాష్ట్ర ప్రజలు అంతా ఒకటే ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు సర్... మీకు ఇక రెస్ట్ ఇద్దామనుకుంటున్నారు... నా సలహా ఏమిటంటే... మే 23 తర్వాత మీరు చాణక్య... పేరుతొ అంతర్జాతీయ స్థాయిలో ఒక రాజకీయ పాఠశాల ప్రారంభించి... ప్రపంచం లోని అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ... మీ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని మీ శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నా...
21, మార్చి 2019, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి