Translate

  • Latest News

    5, ఏప్రిల్ 2019, శుక్రవారం

    ఆరు నూరైనా...నూరు ఆరైనా జగన్ సి.ఎం కావడం తధ్యం


    ఆరు నూరైనా...నూరు ఆరైనా జగన్ సి.ఎం కావడం తధ్యం. మరో 5 రోజుల్లో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలు ఉధృతంగా ప్రచారంలో మునిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు చేసిన సర్వేలు అన్నీ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కు దాదాపు 120 స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. అధికారంలో తెలుగుదేశం పార్టీ 45 నుంచి 55 స్థానాలకు పరిమితమవుతుందని స్పష్టం చేశాయి. ప్రజల నాడి కూడా దాదాపుగా అలాగే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ప్రత్యేకంగా చేయించుకున్న సర్వేలు కూడా అదే విధంగా చెప్పడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడిపోయారు.. జగన్ ను ఓడించడానికి ఎన్ని ఎత్తులు వేసినా పారడం లేదనే నైరాశ్యంలోనే జగన్ పై సంధి ప్రేలాపనలు పేలుతున్నారు. ప్రస్తుతం ఈ రోజుకు ఉన్న పరిస్తితులను బట్టి ప్రజల్లో ఉన్న అభిమానం బట్టి లెక్క వేస్తే  వై.ఎస్.ఆర్.సి.పీ కి 120 నుంచి 130 స్థానాల దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ధన ప్రభావం, పోల్ మానేజ్ మెంట్ లో విఫలం చెందితే పై 30 స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఎంత కాదనుకున్నా... 95 నుంచి 100 స్థానాలకు తగ్గవు కాబట్టి... వై.ఎస్.ఆర్.సి.పీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ సి.ఎం కావడం తధ్యం అనిపిస్తోంది. అన్ని మైనస్ పాయింట్లు లెక్కవేసి... కూడికలు...తీసివేతలు వేసినా... మీ అభిమాన వెబ్ సైట్ భిన్నస్వరం అంచనాల ప్రకారం వై.ఎస్.ఆర్.సి.పీకి గ్యారంటీ గా 95 స్థానాలు వస్తాయి. అవి జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. 
    జిల్లా              మొత్తం స్థానాలు            వై.ఎస్.ఆర్.సి.పీ
    శ్రీకాకుళం         10                               6
    విజయనగరం     9                               5
    విశాఖపట్నం    15                               6
    తూర్పు గోదావరి 19                             9
    పశ్చిమ గోదావరి 15                             7
    కృష్ణా                 16                             8
    గుంటూరు          17                             9
    ప్రకాశం              12                             8
    నెల్లూరు             10                            7
    చిత్తూరు             14                            7
    కడప                 10                            8
    కర్నూలు            14                           8
    అనంతపురం      14                           7
    ------------------------------------------------
                           175                         95    
    ------------------------------------------------
    ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర కోస్తాలో మొత్తం 34 స్థానాలకు గాను 17 స్థానాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 స్థానాలకు గాను 16 స్థానాలు,  రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 33 స్థానాలకు గాను 17 స్థానాలు, కోస్తాలో మిగతా రెండు జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 22 స్థానాలకు గాను 15 స్థానాలు, రాయలసీమ లోని మొత్తం 52 స్థానాలకు గాను 30 స్థానాలు గ్యారంటీగా వస్తాయి. ఆపై వచ్చేవన్నీ పోలింగ్ రోజు పరిస్థితిని బట్టి వస్తే అదనంగా వస్తాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లోను  వై.ఎస్.ఆర్.సి.పీ కి 95 కంటే తగ్గవని భిన్నస్వరం ఢంకా బజాయించి మరీ చెబుతోంది. వై.ఎస్. జగన్ కు ముందస్తుగా అభినందనలు తెలియజేస్తోంది. 

    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    Item Reviewed: ఆరు నూరైనా...నూరు ఆరైనా జగన్ సి.ఎం కావడం తధ్యం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top