రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో ప్రతిపక్ష పార్టీ అయిన వై.ఎస్.ఆర్.సి.పీ దే పైచేయి కానుంది. జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాల్లో సగానికి పైగా అంటే 9 నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్.సి.పీ జెండా ఎగరనుంది. మరో 8 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో (బాపట్ల, వేమూరు, పెదకూరపాడు, చిలకలూరిపేట, గురజాల నెక్ అండ్ నెక్ పోటీ ఉంది. వీటిలో మూడు నియోజకవర్గాల్లో(బాపట్ల, వేమూరు, గురజాల) వై.ఎస్.ఆర్.సి.పీకి ఎడ్జ్ ఉంది.) బాపట్లలో మొదటినుంచి వై.ఎస్.ఆర్.సి.పీ గ్యారంటీ అనుకున్నా కోన రఘుపతి డబ్బులు తీయకపోవడం, అన్నం సతీష్ డబ్బులు విరజిమ్ముతుండడంతో ఇప్పుడు అది నెక్ అండ్ నెక్ పరిస్థితికి వచ్చింది. వేమూరు, గురజాలలో అదే పరిస్థితి. పెదకూరపాడు తెలుగుదేశం గ్యారంటీ అనుకున్నా.. నంబూరు శంకర్రావు కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతుండడంతో కొమ్మాలపాటి శ్రీధరకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎవరు గెలిచినా వెయ్యి లోపు మెజార్టీయే. ఇకపోతే చిలకలూరిపేటలో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. చివరి రోజు వరకు గెలుపు ఎవరిదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు గుంటూరు వెస్ట్, పొన్నూరు, తాడికొండ. ఇది ఈ రోజు నాటికి పరిస్థితి. పోలింగ్ తేదీ నాటికి వీటిలో ఒకటి రెండు నియోజకవర్గాలు నెక్ అండ్ నెక్ గా మారే అవకాశం కూడా ఉంది. (పొన్నూరు, తాడికొండ) ఒకవేళ వాటిలో ఒకటి వై.ఎస్.ఆర్.సి.పీ కి ఎడ్జ్ గా మారినా మారవచ్చు. ఏతా వాతా వై.ఎస్.ఆర్.సి.పీ కి 9 నుంచి 12 స్థానాల వరకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఫ్యాన్ గాలి బలంగా వీస్తే మరో ఒకటి, రెండు కూడా రావచ్చు. భిన్నస్వరం ఈనెల 5న ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త సర్వేలో జిల్లాల వారీగా ఇచ్చిన నివేదికలో గుంటూరు జిల్లాలో 9 స్థానాల్లో గ్యారంటీగా గెలుస్తుందని చెప్పాము కదా... వై.ఎస్.ఆర్.సి.పీ గ్యారంటీగా గెలిచే నియోజకవర్గాలు ఇవే...
1.గుంటూరు ఈస్ట్
2.మంగళగిరి
3. ప్రత్తిపాడు
4. సత్తెనపల్లి
5.మాచర్ల
6. వినుకొండ
7.నరసరావుపేట
8.తెనాలి
9.రేపల్లె
------------------------------
హోరాహోరీ గా పోటీ ఉన్న స్థానాలు
1.బాపట్ల
2.వేమూరు
3.గురజాల
4.పెదకూరపాడు
5.చిలకలూరిపేట
తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉన్న స్థానాలు
1.గుంటూరు వెస్ట్
2. పొన్నూరు
3.తాడికొండ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి