Translate

  • Latest News

    14, మే 2019, మంగళవారం

    తప్పు చేయనప్పుడు భయమెందుకు రవిప్రకాష్..?



    టీవీ 9 ఛానెల్ ద్వారా గత 15 ఏళ్లుగా ప్రజలకు నీతి సూత్రాలు వల్లిస్తూ వచ్చిన రవిప్రకాష్ తనపై వచ్చిన ఫోర్జరీ కేసు ఆరోపణ నేపథ్యంలో విచారణకు రాకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు.  టీవీ 9 యాజమాన్యం రవిప్రకాష్ పై పెట్టిన ఫోర్జరీ కేసులో సి.ఆర్.పీ.సి 160 ప్రకారం ఈ నెల 9, 11 తేదీలలో రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రవిప్రకాష్  10 రోజుల  సమయం కావాలని లాయర్ ద్వారా కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు మూడోసారి సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం రవిప్రకాష్ విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లోనే ఈ సెక్షన్ ను ప్రయోగిస్తారు. నిందితులు సాక్షులను ప్రభావితులను చేయడం, బెదిరింపులకు దిగడం, కీలక ఆధారాలు ధ్వంసం చేస్తారన్న అనుమానం వస్తే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో మరో నిందితుడు, రవిప్రకాష్ అనుంగు మిత్రుడు, సినీ నటుడు శొంఠినేని శివాజీ పత్తా లేకుండా పోయాడు. 
    తప్పు చేసిన వాళ్ళే భయపడతారు..
    వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తనపై ఎన్ని కేసులు పెట్టినా  భయపడ లేదు. విచారణకు హాజరయ్యాడు. తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినా భయపడ లేదు. అదే చంద్రబాబు తనపై ఉన్న 18 కేసుల్లో కనీసం విచారణకు కూడా రాకుండా స్టేలు తెచ్చకున్నాడు. ఆ స్టేలు దశాబ్దాల తరబడి అలాగే కొనసాగుతుండడం మరీ విచిత్రం. ఇప్పుడు ఆయన తోక ఛానల్ టీవీ సి.ఈ.ఓ  రవిప్రకాష్ కూడా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. రవిప్రకాష్ కూడా తప్పు చేసాడు కాబట్టే భయపడుతున్నాడు... లేదంటే... ఒక సామాన్య జర్నలిస్ట్ వందల కోట్లకు ఎలా పడగలెత్తాడు... బుల్లి తెర  ముందు నీతులు వల్లిస్తూ... తెర వెనుక అడుగడుగునా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ వందల కోట్లు అక్రమంగా సంపాదించాడన్న అభియోగాలున్న  రవిప్రకాష్...ఇప్పుడు తన పాపం ఎక్కడ పండుతుందోనని భయపడుతున్నాడా...  15 ఏళ్ల పాటు వార్తా ఛానల్స్ రంగంలో దేశంలోనే తిరుగులేని చక్రవర్తిగా వెలుగొందిన రవిప్రకాష్ ఇప్పుడు తానే ఒక సంచలన వార్త అయ్యాడు. కమ్మ ఐడల్స్ అనే ఒక బ్లాగ్ స్పాట్ లో మీడియా రంగంలో మరో రామోజీ గా కమ్మ సామాజిక వర్గం కీర్తించిన రవిప్రకాష్ ఈ రోజు ఫోర్జరీ కేసులో నిందితుడిగా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నాడు.
    రవిప్రకాష్ గతంలో ఓ సారి అరెస్ట్ అయ్యాడు...
    టీవీ సి,ఈ.ఓ రవి ప్రకాష్ గతంలో ఓ సారి అరెస్ట్ అయ్యాడు. 2014 లో హైదరాబాద్ కు చెందిన జనార్దన్ గౌడ్ అనే ఒక లాయర్ టీవీ9  పై వేసిన ప్రైవేట్ కేసులో రవిప్రకాష్ ఎల్.బి.నగర్ పోలీసులకు లొంగిపోయి  ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే అప్పటి ఆ కేసు వృత్తిపరమైనది...జర్నలిస్ట్ కి ఇలాంటివి మామూలే... కాకపొతే ఇప్పుడు ఎదుర్కొంటున్న కేసు వ్యక్తిగతమైనది. తాను అనుక్షణం వల్లించే నైతిక సూత్రాలకు విరుద్ధంగా తానే ప్రవర్తించిన సందర్భం ఇది. ఈ విషయంలో తప్పకుండా తాను సమాజానికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్టం నుంచి తప్పించుకు తిరగడం కాదు... చట్టం ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడించాలి. దమ్ముంటే తన నిజాయితీ నిరూపించుకోవాలి...

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తప్పు చేయనప్పుడు భయమెందుకు రవిప్రకాష్..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top