Translate

  • Latest News

    16, మే 2019, గురువారం

    మళ్ళీ బి.జె.పీ తో చంద్రబాబు దోస్తీ ?



    చంద్రబాబు మళ్ళీ బి.జె.పీ తో జత కట్టనున్నారా.. జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. చంద్రబాబు తన రాజ గురువు రామోజీ రావును బుధవారం రామోజీ ఫిలిం సిటీ లో కలిసినపుడు రామోజీ చంద్రబాబుకు ఈ మేరకు  హితోపదేశం చేసినట్టు తెలుస్తోంది. ఏ  విధంగా చూసినా జాతీయ స్థాయిలో మళ్ళీ బి.జె.పీ యే  అధికారంలోకి వచ్చేది ఖాయంగా కనిపిస్తోంది... బి.జె.పీ తో శత్రుత్వం కన్నా... దోస్తీ యే మేలు అని,  ఎన్డీ.ఏ నుంచి బయటకు రావడంలో టీ.డీ.పీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీ రావు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. మళ్ళీ ఎన్. డీ. ఏ అధికారంలోకి వస్తే కలసిపోవడమే మంచిదనే అభిప్రాయం  వీరిద్దరి మధ్య చర్చల్లో వ్యక్తమైనట్టు సమాచారం.
    ఈ విషయం భిన్నస్వరం ముందుగానే ఊహించింది. గత నెల 26 న భిన్నస్వరం మే 23 తర్వాత టీ.డీ.పీ ముక్క చెక్కలు..? అనే శీర్షికతో (కావాలంటే ఈ లింక్లో చూడండి.( http://www.bhinnaswaram.com/2019/04/23.html) ఒక కథనాన్ని  వెలువరించిన సంగతి మా పాఠకులకు తెలిసిందే... ఆ కధనంలో బి.జె.పీ తో తెగతెంపులు చేసుకుని చంద్రబాబు తప్పు చేశారని టీ డీ.పీ నాయకులు అంతర్మధనం చెందుతున్నారని  రాశాం... 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న... అపర చాణిక్యుడు చంద్రబాబు జాతీయ రాజకీయాలను అంచనా వేయడంలో తొలిసారిగా తప్పులో కాలేశాడని, జగన్ ప్రత్యేక హోదా అంటూ రెచ్చగొడితే చంద్రబాబు ఆ ఉచ్చులో పడిపోయి బీ.జె.పీ తో బంధం తెంచుకుని తప్పు చేసాడని టీడీ.పీ నాయకులు మధనపడుతున్నారని రాశాం.

    నిన్న రాజగురువు రామోజీ కూడా చంద్రబాబుకు అదే చెప్పాడు... సో రాజ గురువు ఆదేశం మేరకు చంద్రబాబు అడుగులు మళ్ళీ కమలం వైపు పడే అవకాశాలు ఉన్నాయి. మోడీ కాకుండా గడ్కరీ అయితే ఇబ్బంది లేదని అల్ రెడీ చంద్రబాబు ఇంతకుముందే హింట్లు ఇచ్చాడు కూడా.. బీ.జె.పీ కి ఒక వేళ  పూర్తి మెజారిటీ రాకపోతే చంద్రబాబు తనతో పాటు కలిసొచ్చే ఒకరిద్దరు ప్రాంతీయ పార్టీ నాయకులతో కలసి బీ.జె.పీ తో బేరం పెట్టి మోడీ ని మార్చి గడ్కరీ ని ప్రధానమంత్రి ని చేస్తామంటే మద్దతు ఇస్తామని చెప్పవచ్చు. కాబట్టి ఎన్నికల ఫలితాల తర్వాత బాబు గారు మళ్ళీ కమలాన్ని కౌగలించుకుంటే.. ఏ మాత్రం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎటొచ్చి వెర్రి పప్ప అయ్యేది కేంద్రంలో పప్పు రాహుల్ గాంధీయే.. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మళ్ళీ బి.జె.పీ తో చంద్రబాబు దోస్తీ ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top