అజీర్ణ సమస్యతో బాధపడేవారు తరచూ ఎసిడిటీ మాత్రలు తీసుకొంటూంటారు. ఈ మాత్రలు తీసుకోవడం వలన అజీర్తిసమస్య, కడుపులోమంట, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం మాట ఎలాఉన్నా, దీర్ఘకాలంలో కిడ్నీలమీద తీవ్రప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎసిడిటీ మాత్రలు వాడుతున్న సుమారు మూడు లక్షల మంది మీద దీర్ఘకాలం పరిశోధన నిర్వహించారు. వీరిలో ఎసిడిటి సమస్య తగ్గుముఖం పట్టకపోగా, వీరి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినడానికి పరిశోధకులు గుర్తించారు. దీని వలన అకాల మృత్యువుబారిన పడే అవకాశాలు 50 శాతం పెరుగుతాయని వారు చెబుతున్నారు. వైద్యుల సూచించిన మేరకు ఈ మందులు వాడుతున్న దుష్ర్పభావాలు మాత్రం తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఎసిడిటీ, అజీర్తి తదితర సమస్యల నుంచి తప్పించుకోవడానికి మందుల కన్నా సహజపద్ధతులు అవలంభించాలని వారు సూచిస్తున్నారు.
21, జులై 2019, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి