తరచుగా ఒకే వర్తకుడితో లావాదేవీలు నెరుపుతుంటారా..? ఆ లావాదేవీలకు గాను కార్డుతో చెల్లింపులు జరుపుతుంటారా..? అయితే, వచ్చే నెల నుంచి ఈ చెల్లింపుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఒక్క ఆదేశం (మాండేట్) ద్వారా ఇకపై ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరపవచ్చు. అంటే, లావాదేవీ జరినప్పుడల్లా రెండంచెల (కస్టమరు జనరేట్ చేసుకున్న పాస్‌వర్డ్‌తోపాటు వన్ టైం పాస్‌వర్డ్) ధ్రువీకరణ తతంగం లేకుండా చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయవచ్చన్నమాట. అదెలాగంటే.. డెబిట్, క్రెడిట్ లేదా ప్రీ-పెయిడ్ కార్డుల లావాదేవీలకు ఈ-మాండేట్ సెట్ చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది.
సెప్టెంబరు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తాజా సర్క్యులర్‌లో వెల్లడించింది. ఈ ఉచిత సౌకర్యం కేవలం పునరావృత చెల్లింపులకు మాత్రమేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ-మాండేట్‌ను సెట్ చేసుకునేందుకు కార్డు హోల్డర్లు వన్ టైం రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా నిర్ణయించే స్థిర విలువకు లేదా మారే విలువకూ ఆటోమెటిక్ చెల్లింపు మాండేట్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఆదేశంలో ఎలాంటి సవరణకైనా మళ్లీ ధ్రువీకరణ అవసరమవుతుంది. కార్డు హోల్డర్లు ఏ సమయంలోనైనా ఈ-మాండేట్‌ను ఉపసంహరించుకోవచ్చు.

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి