Translate

  • Latest News

    23, సెప్టెంబర్ 2019, సోమవారం

    ఎం.ఎల్.ఏ కిడారి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారా...


    సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు మావోయిస్టులు అరకు ఎం.ఎల్.ఏ కిడారి సోమేశ్వర రావును, మాజీ ఎం.ఎల్.ఏ సివేరి సోమ ను హత్య చేసి సంచలనం సృష్టించారు...ఆ వార్తతో పాటు  ఆ హత్యలకు నేతృత్వం వహించింది ఒక మహిళా మావోయిస్టు నాయకురాలు అనే వార్త కూడా అంతే  సంచలనం సృష్టించింది. ఆమె, ఆమెతో పాటు పాల్గొన్న మరో ఇద్దరి పేర్లను కూడా పోలీసులు అప్పుడే వెల్లడి చేశారు. (పైన చిత్రం ఏడాది క్రితం 2018 సెప్టెంబర్ 23 న జరిగిన అరకు ఎం.ఎల్.ఏ కిడారి హత్యలో  పాల్గొన్న ముగ్గురు మావోయిస్టులు... అందులో మధ్యలో అరుణ... పోలీసులు వెల్లడి చేసిన చిత్రం) ఆమె పేరు అరుణ ఎలియాస్ వెంకట  చైతన్య అని, ఆమె కొయ్యూరు ఎన్కౌంటర్ లో చనిపోయిన ప్రముఖ మావోయిస్టు నాయకుడు ఆజాద్ కు సోదరి అని కూడా వెల్లడించారు. సరిగ్గా ఏడాదికి నిన్న ఏ ఓ బీ లో జరిగిన ఎన్కౌంటర్ లో పోలీసుల చేతిలో  ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఆ ముగ్గురిలో ఒకరు అరుణ అని పోలీసులు లీక్ చేశారు. అంటే ఈ ఎన్కౌంటర్ నిజంగానే జరిగిందా... లేదా ముందుగానే ఎక్కడో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పోలీసులు తమకు బాగా అలవాటైన ఎన్కౌంటర్ కథ అల్లారా... అనే అనుమానం వస్తోంది. లేదా ఇది నిజంగానే పోలీసులు చెబుతున్నట్టు ఎన్కౌంటర్ జరిగిందా... సరిగ్గా ఏడాదికి జరగడం కాకతాళీయమేనా... ఏమో... అది నిజం కానూ వచ్చు...కాకపోనూ వచ్చు.... ఒకవేళ పోలీసులు కిడారి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారా... అందుకే సరిగ్గా సంవత్సరానికి ఇలా ప్లాన్ చేశారా... ఏదయినా జరగవచ్చు... ఏదిఏమైనా కానీ... ఇటీవలి కాలంలో పోలిసులు ఏ ఓ బీ మీద కాన్సెన్ట్రేషన్ పెంచిన మాట నిజం... ఇటీవలే మావోయిస్టు అగ్రనేత ఆర్.కె అక్కడ ఉన్నట్టు సమాచారం అందడంతో ఆపరేషన్ ఆర్.కె అని టార్గెట్ పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి.. ఏమైందో తెలియదు కానీ.. మరి ఆర్.కె దొరకనందున... అరుణ పై టార్గెట్ పెట్టి పోలీసులు ఇలా... తమ సమర్ధతను నిరూపించుకుని ఉండవచ్చు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఎం.ఎల్.ఏ కిడారి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top