Translate

  • Latest News

    30, మార్చి 2020, సోమవారం

    సెల‌వు రోజుల్లో ఇంటిని ఇలా తీర్చిదిద్దుకోండి...


    కొన్ని ప‌నులు చేయాలంటే బ‌ద్దకం. దీంతో పాటు రోజువారి ప‌నులు ఎలాగూ అడ్డుప‌డుతుంటాయి. చింద‌ర‌వంద‌రంగా ఉన్న ఇంటిని స‌ర్దుకోవాల‌ని, వ‌స్తువుల‌ను నీటుగా ఉంచుకోవాల‌ని అనుకుంటాం. కాని ఉరుకుల ప‌రుగుల జీవితంలో ప్ర‌తి రోజు సాధ్యం కాదు. దీంతో పాటు మ‌న‌కు స‌హాయం చేసేవారు ఉండ‌రు. ఇప్ప‌డు లాక్‌డౌన్ దెబ్బ‌కు అంద‌రూ ఇంట్లో ఉంటున్నారు. ఇళ్ల‌లో ఉన్న వ‌స్తువుల‌ను ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో అమ‌ర్చుకోవ‌టం, స‌ర్దుకోవ‌టానికి ఇదే స‌మయం. 
    ముందుగా ఇంటిని స‌ర్దుకొనే క్ర‌మంలో ఏ వ‌స్తువు ఎక్క‌డ ఉండాలో అవ‌గాహ‌న ఉండాలి. పిల్ల‌లు ఉన్న ఇళ్ల‌లో పుస్త‌కాల బ్యాగులు, పుస్త‌కాలు, వారు ఆడుకొనే బొమ్మ‌లు ఎలా ప‌డితే అలా ప‌డేస్తుంటారు. బాత్రుమ్‌,కిచెన్‌, బెడ్‌రూమ్‌ల‌లో వ‌స్తువులు ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో ఉండ‌వు. ఇప్పుడు వీటిపై దృష్టిసారించండి. పిల్ల‌ల‌కు ప‌నిచెప్పివారి చేతే కొన్ని తేలిక ప‌నులు చేయించండి. దీంతో వారికి ఏవ‌స్తువు ఎక్క‌డ ఉండాల‌న్న విష‌యంలో అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది. 
    ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ గదులకు సరియైన వెంటిలేషన్‌ ఉండాలి. తలుపులు కాసేపైనా తెరిచి తాజా గాలి వీచేలా చూసుకోవాలి. ఇలా సెల‌వు రోజుల్లో పిల్ల‌ల‌కు కూడా ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచుకోవాల‌న్న అంశంపై అవ‌గాహ‌న పెరుగుతుంది.



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సెల‌వు రోజుల్లో ఇంటిని ఇలా తీర్చిదిద్దుకోండి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top