Translate

  • Latest News

    30, మార్చి 2020, సోమవారం

    వంట చేసే ట‌ప్పుడు ఈ జాగ్రత్త‌లు పాటిస్తున్నారా...?




    అనేక రోగాల‌కు నిల‌యం వంట‌గ‌దిని మీకు తెలుసా..? క‌నీస జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే ఇంటిల్లిపాది ఇబ్బందులు ప‌డే ప్ర‌మాదం ఉంది. అంద‌రు భావించిన‌ట్లు బాత్రూమ్‌లు శుభ్రంగా ఉంటే చాలు అనుకుంటే పొర‌పాటే. వంట‌గ‌దిని ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌టం, ఆహారం వండే విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే ఆనారోగ్యం ద‌రిచేరే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. తినే ఆహారాన్ని ప‌రిశుభ్రంగా ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

    అనేక‌మంది వంట‌పాత్ర‌లు ఉద‌యాన్ని శుభ్రం చేసుకుంటు ఉంటారు. కాని క‌త్తిపీట‌లు, వాడే క‌త్తుల‌ను ప‌ట్టించుకోరు. వాటిపై అనేక హానిక‌ర‌మైన సూక్ష్మ‌జీవులు ఉంటాయి. కూర‌గాయ‌లు త‌రిగే ముందు వీటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఆహారాన్ని వండ‌టానికి ముందే చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాలి. వంట‌కు వాడ‌టానికి వాడే నీటి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు పాటించాలి.

    చికెన్‌,మ‌ట‌న్‌ల‌ను వండే క్ర‌మంలో ముందుగా వాటిని శుభ్రం చేసుకున్న అనంత‌రం తిరిగి చేతులను శుభ్రం చేసుకోవాలి. కూర‌గాయ‌లను క‌డిగిన త‌రువాత చెక్కు తీయాలి. ఇలా చేస్తే వాటిలో ర‌సాయ‌నాలుతో పాటు సూక్ష్మ‌జీవులు న‌శిస్తాయి. ఆహార ప‌దార్ధాల‌ను పూర్తి ఉడిక‌న త‌రువాతే తినాలి. ఫ్రిజ్‌లో ఉంచి ప‌దే వేడి చేసుకోని తిన‌డం వ‌ల్ల వాటిలో ఉన్న షోష‌కాలు న‌శిస్తాయి. వండిన ఆహారాన్ని గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద రెండు గంట‌లు మాత్ర‌మే నిల్వ ఉంచాలి. త‌రుచు ఫ్రిజ్‌ను కూడా శుభ్రం చేసుకోవ‌టం మంచిది.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వంట చేసే ట‌ప్పుడు ఈ జాగ్రత్త‌లు పాటిస్తున్నారా...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top