Translate

  • Latest News

    30, మార్చి 2020, సోమవారం

    ముల్తానీ మట్టి సౌంద‌ర్య సాధ‌న‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా...?


    ముల్తానీ మట్టి సౌంద‌ర్య సాధ‌న‌కు ఎప్ప‌టినుంచే వాడుతున్నారు. ముల్తానీ మట్ట్టిని ఫేస్‌ప్యాక్‌గా వేసుకుంటే ముఖం మీది జిడ్డు, మలినాలు పోతాయి. ఈ మట్టిలో పండ్ల గుజ్జు, తేనె, కలబంద కలిపి ఇంటివద్దనే ముఖ కాంతిని పెంచుకోవచ్చు. వేస‌వి కాలంలో ఎండకు వెంట‌నే ముఖం మ‌లిన‌మౌతుంది. మ‌హిళ‌ల ముఖం కాంతివంతంగా మెరియాలంటే ముల్తానీ మ‌ట్టిని ట్రై చేయ‌వ‌చ్చు. చ‌ర్మ‌,జుట్టు సౌంద‌ర్యానికి ఉప‌యోగించే దీనిని అనేక‌మంది ఉప‌యోగిస్తుంటారు.

    ఇందులో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్ మరియు డోలమైట్ తో సహా వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. . పొడి రూపంలో అందుబాటులో ఉండే ఇది తెలుపు,ఆకుపచ్చ, నీలం, గోధుమ లేదా ఆలివ్ వంటి వివిధ రంగులలో దొరుకుతుంది. ఎటువంటి ర‌సాయ‌క ప‌దార్ధాలు లేని స‌హ‌జ‌సిద్ద సౌంద‌ర్య సాధ‌నం కాబ‌ట్టే దీనికి ఎంతో డిమాండ్ ఉంది.

    జిడ్డు చ‌ర్మం ఉన్న‌వారు ముల్తానీ మట్టిలో రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. ఈ పేస్ట్‌ కళ్లు, పెదవులకు అంటకుండా జాగ్రత్తపడాలి. ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే జిడ్డు వదిలి చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.: కొందరిలో మొటిమలు, మచ్చలు తరచుగా ఏర్పడుతుంటాయి. అలాంటి వారుగంధం పొడి, రోజ్‌వాటర్‌, వేప ఆకుల పొడిని ముల్తానీ మట్టిలో వేసి మెత్తని మిశ్రమం తయారుచేసుకోని , ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది. బ్లాక్‌హెడ్స్‌ తగ్గాలంటే టేబుల్‌ స్పూన్‌ ముల్తానీ మట్టిలో బేకింగ్‌ సోడా, చార్‌కోల్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌ లేదా మినరల్‌ వాటర్‌ వేసి రాసుకుంటే బ్లాక్‌హెడ్స్‌ తగ్గిపోతాయి

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ముల్తానీ మట్టి సౌంద‌ర్య సాధ‌న‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top