Translate

  • Latest News

    28, ఏప్రిల్ 2020, మంగళవారం

    జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ పొడిగింపు తప్పదా...


    నిన్న మొన్నటిదాకా మనం తెలంగాణ తో కలిసి ఉన్నాం కాబట్టి... ఏ విషయమైనా తెలంగాణ తో పోల్చి చూసుకుంటాం. కరోనా విషయంలో కే.సి.ఆర్ తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి తన వాక్పటిమతో అద్భుతంగా  ప్రజలకు కరోనా గురించి పూసగుచ్చినట్టు విడమరిచి చెప్పాడు.. ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదు...బతికుంటే బలుసాకు తినొచ్చు అని... అంత  కఠినంగా చెప్పబట్టే అక్కడి ప్రజలు లాక్ డౌన్ కచ్చితంగా పాటించారని, అందుకే అక్కడ కేసులు తగ్గిపోయాయని  ఒక వాదన. ఏ.పీ లో జగన్ కరోనా గురించి అంత కఠినంగా చెప్పకపోవడంతోనే ప్రజలు కూడా ఇష్టానుసారం రోడ్ల మీదకు వస్తున్నారనేది ఒక విమర్శ. ఏ.పీ లో ముఖ్యమంత్రి జగన్ నిత్యం అధికారులతో సమీక్షలు చేయడం ఓ.కే కానీ... ప్రెస్ మీట్లు పెట్టి నేరుగా ప్రజలకు కరోనా కట్టడికి కఠినంగా ఉండాలని ప్రభావవంతంగా చెప్పలేకపోయారని  ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్న మాట నిజం. పైగా జగన్ ప్రెస్ మీట్లు పెట్టిన రెండు మూడు సార్లు కూడా కరోనా కు భయపడొద్దు.. అది కూడా ఒక జ్వరం లాంటిదే... అని తేలిక చేసి చెప్పడంతో ఇక్కడ ప్రజలు కూడా దాన్ని తేలికగా తీసుకుని లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించకుండా విచ్చలవిడిగా రోడ్ల మీదకు వస్తున్నారని...అందుకే ఇక్కడ కేసులు రోజురోజుకు ఎక్కువగా పెరిగిపోతున్నాయని విమర్స ఉంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో  దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా టెస్టులు చేస్తున్నామని, అందుకే కేసులు ఎక్కువగా ఉంటున్నాయని జగన్  చెబుతున్నారు. కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ  ప్రధాన మంత్రితో పోయినసారి సి.ఎం ల సమావేశంలోనే జోన్ల వారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలని జగన్ తన గళాన్ని వినిపించాడు. అప్పుడు అందరూ ట్రోల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెబుతున్నాడు.. కరోనా అనేది  ఇప్పుడప్పుడే మనల్ని వీడిపోయెది కాదు... ఆ వాస్తవాన్ని గ్రహించి మనం దాంతో సహజీవనం చేయడం నేర్చుకోవాలి అని... ఈ మాటను కూడా కొందరు ట్రోల్ చేస్తున్నారు...సహజీవనం అట... కరోనా తో  డేటింగ్ చేద్దాం అంటున్నాడు... అని ఎగతాళి చేస్తున్నారు. ఒక మాటను ఎవరికీ తోచిన అర్ధంలో వారు తీసుకుంటారనుకోండి.
    ఇది ఇలా ఉండగా ఈ సారి ప్రధాన మంత్రి వాయిస్ లో కూడా కొద్దిగా మార్పు ధ్వనిస్తోంది... నేరుగా చెప్పకపోయినప్పటికీ ఇంచుమించుగా జగన్ వాయిస్ కు దగ్గరగా ఉంది. హాట్ స్పాట్ ల లోనే పొడిగించి... మిగతా వాటిలో ఆంక్షలు దశల వారీగా ఎత్తివేస్తారనే టాక్ వినపడుతోంది. టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం... కాబట్టి కేసులు ఎక్కువగా వస్తున్నాయి...భయపడకండి అని కూడా చెబుతున్నారు..భవిష్యత్తు జన జీవనంలో ఇక మాస్క్ లు ఒక భాగం అవుతాయని కూడా అన్నారు.  సో... మరి మోడీ కూడా  జగన్ ను అనుసరిస్తున్నట్టే కదా... సరే... ఎవరి విధానాలు సరైనవో... ఎవరి చర్యలు సమర్ధనీయమో కాలమే చెబుతుంది..
    అయితే అంతర్జాతీయ వైద్య నిపుణులు చెప్పేదాని  ప్రకారం కనీసం 11 వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించాలి. మన దేశంలో మే 3 నాటికి ఆరు వారాలు పూర్తి అవుతుంది. అంటే ఇంకా 5 వారాలు లాక్ డౌన్ చేయాల్సి ఉంది. అంటే ఆ లెక్క ప్రకారం జూన్ మొదటి వారం  వరకు పొడిగించాల్సి ఉంది. సో... ప్రధానమంత్రి మరి కొన్ని ఆంక్షల సడలింపుతో జూన్ మొదటి వారం  వరకు పొడిగిస్తారని తెలుస్తోంది. ఇక యూజీసీ వారు చెప్పిన దాన్ని బట్టి విద్యా సంస్థలు సెప్టెంబర్ వరకు మూతే... ఈ విద్యా సంవత్సరం సెప్టెంబరు లో మొదలవుతుందని యూజీసీ ప్రకటించడం గమనార్హం.




    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ పొడిగింపు తప్పదా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top