Translate

  • Latest News

    20, ఏప్రిల్ 2020, సోమవారం

    క‌రోనా మేడ్ ఇన్ చైనా


    కరోనా వ్యాప్తి విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు చైనాపై విరుచుకుపడ్డారు. ‘‘కరోనా సమాచారాన్ని బహిర్గతపర్చడంలో చైనా ఆలస్యం చేసింది. ఆ వైర్‌సను ఉద్దేశపూర్వకంగా విడుదల చేసినట్లు తేలితే.. చైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుంది. అది ఎంతలా అంటే.. మీకు(చైనా) తెలుసు. 1917 కాలం నాటి పరిస్థితులకు దిగజారిపోతుంది’’ అని హెచ్చరించారు. శనివారం ఆయన వైట్‌హౌ్‌సలో విలేకరులతో మాట్లాడారు. పొరపాటుకు, కావాలని చేసేదానికి తేడా ఉంటుందని, అదేంటో తాము నిగ్గుతేలుస్తామని స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి చైనా సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌-19 తర్వాత ఇరాన్‌లో మార్పు కనిపిస్తోందని వ్యంగ్యంగా అన్నారు. కాగా.. 2018లోనే చైనాలోని అమెరికా రాయబార కార్యాలయం వూహాన్‌ ల్యాబ్‌లో ప్రమాదకరమైన వైర్‌సలు ఉన్నాయని గుర్తించిందని వాషింగ్టన్‌ పోస్టు ఓ కథనంలో పేర్కొంది.

    తమ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందనే ఆరోపణల్లో నిజం లేదని వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(డబ్ల్యూఐవీ) డైరెక్టర్‌ యువాన్‌ జిమింగ్‌ అన్నారు. కరోనాకు కేంద్ర బిందువైన వూహాన్‌ నగరం ఇప్పుడు ‘లో రిస్క్‌’ కేటగిరీకి చేరిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది.  కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో సహా ప్రపంచ దేశాలు స్పందించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తునకు ఆస్ర్టేలియా పిలుపునిచ్చింది. వూహాన్‌ నగరంలో తొలిసారిగా బయటపడిన వైర్‌సను ఎదుర్కొనే సమయంలో చైనాపై వస్తున్న ఆరోపణలను సమర్థిస్తున్నట్టు ఆస్ర్టేలియా విదేశాంగ మంత్రి మారిన్‌ పేన్‌ స్పష్టం చేశారు. ‘వైరస్‌ పుట్టుకతోపాటు దాన్ని ఎదుర్కోవడంలో అనుసరించిన వ్యూహాలు, ఆ సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్న వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్ర దర్యాప్తు ద్వారానే ఇది సాధ్యం. దీనిపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కూడా చర్చించాం’ అని మారిన్‌ వెల్లడించారు.


    ల్యాబ్‌ నుంచే కరోనా(సార్స్‌ కోవ్‌-2) బయటకు వచ్చిందని ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త, నోబెల్‌ అవార్డు గ్రహీత మోంటాజ్ఞయిర్‌ అన్నారు. ‘‘ఎయిడ్స్‌కు మందును కనుక్కొనే క్రమంలో కరోనా బయటకు వచ్చి ఉంటుంది. కరోనా జన్యుపటంలో హెచ్‌ఐవీ, మలేరియా దాఖలాలున్నాయి’’ అన్నారు. వూహాన్‌ నగరంలోని వైరాలజీ ల్యాబ్‌లో 2000 సంవత్సరం నుంచే కరోనా వైరస్‌ ఉందని తెలిపారు. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: క‌రోనా మేడ్ ఇన్ చైనా Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top