Translate

  • Latest News

    19, ఏప్రిల్ 2020, ఆదివారం

    వ్యాధి నిరోధ‌క శ‌క్తిని ఇలా పెంచుకోండి




    మ‌న శ‌రీరంలో ఎప్పుడైతే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుందో అప్పుడు అన్నీ రోగాలు, అంటువ్యాధులు మ‌న‌పై దాడి చేస్తాయి. దేశ సైన్యం బ‌ల‌హీనంగా ఉంటే శ‌త్రు దేశ సైనికులు దాడి చేస్తారో... మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి స‌న్న‌గిల్లితే స‌క‌ల రోగాల‌కు మ‌న శ‌రీరం ఆతిథ్యం మిచ్చిన‌ట్లే. కొన్ని సంద‌ర్బల‌లో కొన్ని ర‌కాల వ్యాధులు సంక్ర‌మించిన‌ప్పుడు స‌హ‌జంగా రోగ నిరోద‌క శ‌క్తి త‌గ్గుతుంది. దాన్ని మ‌నం తీసుకొనే అహారం ద్వారా, అల‌వాట్ల ద్వారా పున‌రుద్ద‌రించుకోవ‌చ్చు. 

    మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. తరచుగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయంటే మీరు తీసుకునే ఆహారం సరైనది కాదు అని తెలుపుతుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి అందితేనే.. ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి నిత్యం తినే ఆహారంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఉండేలా జాగ్రత్త పడాలి. 

    రోగాల బారిన మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌టానికి వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవడం చాలా అవసరం. ఈ శక్తి పెంచుకునేందుకు మ‌రే ఇత‌ర మందులు వాడ‌కుండానే స‌హ‌జ‌సిద్ద‌మైన ఫ‌లాలు, ఇంట్లో వాడుకొనె కూరగాయ‌లతో వ్యాధుల ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. ఇందుకు విటమిన్‌ సి, డ్రై ఫ్రూట్స్‌, అల్లం, వెల్లుల్లి వంటివి సహాయపడతాయి. తాజా పండ్లు, కూరగాయలు రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవ‌చ్చు. 

    శరీరంలోని టాక్సిన్స్‌, ఇతర వ్యర్థాలను తొలగించడానికి నీరు ఎక్కువగా తాగడం ఓ మంచి ఉపాయం. లోపల ఉండే మలినాలను చెదరగొట్టి, శరీరానికి వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్‌ అనే బ్యాక్టీరియా మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాంప్లెక్స్‌ కార్బోకాంపౌండ్స్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. అందువల్ల సాధారణంగా వచ్చే డయేరియా వంటి వ్యాధులను నివారించవచ్చు. గ్రీన్‌ టీలో పోలిఫెనోల్స్‌ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. గ్రీన్‌లో నిమ్మ లేదా తేనె కలుపుకొని తాగితే మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబును నివారించేందుకు సహాయపడతాయి. 

    గుమ్మడిలో కెరోటిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థలోని వివిధ భాగాల పనితీరును మెరుగుపరుస్తుంది. 

    రోజూ ఉదయాన్నే నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగండి. తులసిమొక్కకు రోగనిరోధకశక్తిని పెంచే గుణంతోపాటు.. ఇందులోని ఔషధగుణాలు గొంతును, ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతాయి.


     ఒక అడుగు పొడుగున్న తిప్పతీగను తీసుకుని దాంతోపాటు ఐదారు తులసి ఆకులను నీళ్లల్లో వేసి 20 నిమిషాల పాటు మరిగించండి. రుచికోసం ఆ కషాయానికి తగుమోతాదులో నల్లమిరియాలు, సైంధవలవణం, రాతి ఉప్పు, పటిక బెల్లం వంటివి కలుపుకొని ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా తాగండి. రోగ నిరోధక వ్యవస్థను అద్భుతంగా పనిచేయించే శక్తి ఈ కషాయానికి ఉంది.పచ్చివెల్లుల్లిని తినగలిగినవారు రోజూ ఉదయాన్నే రెండు రెబ్బల్ని గోరువెచ్చటి నీటితో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

    .నిమ్మజాతికి చెందిన పండ్లను.. సి విటమిన్‌ అధికంగా ఉండే పండ్లరసాలను అధికంగా తీసుకుంటే మంచిది.విటమిన్‌ సి ఉన్న జామకాయ, బత్తాయి, కమలాపండు, నిమ్మకాయ, కాప్సికమ్‌లాంటివి తినాలి.చిలగడ దుంప, బొప్పాయి, క్యారెట్‌ లాంటివి తీసుకోవాలి.చిలగడ దుంప, బొప్పాయి, క్యారెట్‌ లాంటివి తీసుకోవాలి.నల్లద్రాక్ష, వేరుసెనగలు, పిస్తా, మల్బరీస్‌, స్ట్రా బెర్రీలు... వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వ్యాధి నిరోధ‌క శ‌క్తిని ఇలా పెంచుకోండి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top