Translate

  • Latest News

    19, ఏప్రిల్ 2020, ఆదివారం

    మున‌గాకు ప్ర‌యోజ‌నాలు తెలిసా....



    ఇళ్ల ముందు ఉచితంగా ల‌భించే అనేక మొక్క‌లు, చెట్ల‌లో ఔష‌ద‌గుణాలు ఉంటాయి. ప్ర‌తి చోట విరివిగా దొరికే మున‌గాకు ఎన్నో పోష‌క విలువ‌లు క‌లిగి ఉండ‌టంమే కాకుండా ఔష‌ద ల‌క్ష‌ణాలు క‌లిగి ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి మున‌గాకులో ఉన్న ఔష‌ద గుణాలు తెలిసి ఉండ‌బ‌ట్టే మున‌గాకు విరివిరిగా వినియోగించేవారు. త‌మిళ‌నాడు త‌దిత‌ర ప్రాంతాల‌లో మున‌గాకు ఆకు కూర‌ల వ‌లే అమ్మ‌కాలు కొన‌సాగిస్తుంటారు. అయితే ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌ల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల‌లో మిన‌హించి ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో మున‌గాకును అంత‌గా ప‌ట్టించుకోరు.

    ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. అందుకే చాల ప్రాంతాల‌లో మున‌గాకును నూరి కట్టుకడుతుంటారు. మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి. మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి. మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది



    మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. వందగ్రాముల మునగాకులో నీరు - 75.9 శాతం, పిండి పదార్థాలు - 13.4 గ్రాములు,ఫ్యాట్స్ - 17 గ్రాములు,

    మాంసకృత్తులు - 6.7 గ్రాములు,కాల్షియం - 440 మిల్లీ గ్రాములు,పాస్పరస్ - 70 మిల్లీ గ్రాములు, ఐరన్ - 7 మిల్లీ గ్రాములు

    ‘సి’ విటమిన్ - 200 మిల్లీ గ్రాములు,ఖనిజ లవణాలు - 2.3 శాతం ఉంటుంది. కాబ‌ట్టే మిగిలిన ఆకు కూర‌ల‌లో ఉండే వాటిక‌న్నా మున‌గాకులో ఉండే పోష‌కాలు అధికం. 




    పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు.ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు... మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.

    మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి.

    శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్‌ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్‌ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.

    మ‌న‌దేశంలో విరివిరిగా దొరికే ఇటువంటి ఔష‌ద చెట్టు అంటే మ‌న‌కు నిర్ల‌క్ష్యమే. ప్ర‌పంచం అంతా మ‌న జీవ‌న విధానం వైపు చూస్తున్న స‌మ‌యంలో వేల సంవ‌త్స‌రాల నుంచి పౌష‌కాహారంగా, ఔష‌దంగా ఉన్న మున‌గాకుపై నిర్ల‌క్ష్యం త‌గ‌దు.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మున‌గాకు ప్ర‌యోజ‌నాలు తెలిసా.... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top