Translate

  • Latest News

    4, ఏప్రిల్ 2020, శనివారం

    పత్రికలు, థియేటర్లకు పెను ముప్పే


    రానున్న కాలం అంతా డిజిటల్ యుగానిదే... అవును... ఇప్పుడు మీరు చూస్తున్నవేవీ భవిష్యత్తులో మీకు కనపడకపోవచ్చు... ఒకవేళ ఉన్నా ఇప్పుడున్న స్థాయిలో ఉండకపోవచ్చు. ఇప్పుడున్నంత విస్తృతంగా ఉండకపోవచ్చు. ప్రజలు ఇప్పటిలా వాటిని రిసీవ్ చేసుకోకపోవచ్చు. ముఖ్యంగా ప్రచార, ప్రసార మాధ్యమాలకు సంబంధించి విప్లవాత్మక పరిణామాలు సంభవించనున్నాయి. ఇవి ఆహ్వానింపదగినవా...కాదా అన్నది వేరే విషయం... కానీ పెను ఉప్పెనలా వస్తున్న డిజిటల్ విప్లవాన్ని అరచేతిని అడ్డుపెట్టి ఆపడం ఎవరి తరమూ కాదు. ఆల్ రెడీ ఇప్పటికే మనం డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టేశాం. అయితే ఇది ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉంది. రానున్న దశాబ్దంలో ఇది పూర్తిస్థాయిలో వేళ్లూనుకుంటుంది. అప్పుడు ఇక ప్రింట్ మీడియా ప్రభావం చాలావరకు తగ్గుతుంది. డిజిటల్ మీడియానే రాజ్యమేలుతుంది. ఇప్పటికే 35 ఏళ్ల లోపు యువతరం అంతా పత్రికలు చదవడం మానివేశారు. వార్తలు అన్నీ సెల్ ఫోన్ లోనే చూస్తున్నారు. ప్రధాన పత్రికల ఆన్లైన్ ఎడిషన్ లను ఫాలో అవుతున్న విషయం అందరకూ తెలిసిందే... పత్రికలు చేత్తో పట్టుకుని చదవడానికి ఎడిక్ట్ అయిన పాత తరం మాత్రమే రోజూ పత్రిక కోసం ఎదురు చూస్తోంది.
    థియేటర్లకు గడ్డు కాలం 

    ఇక ప్రజలకు ప్రధాన ఎంటెర్టైనేమేంట్ అయినా సినిమా రంగంలో కూడా డిజిటల్ యుగం విప్లవాత్మక పరిణామాలు తీసుకురానుంది. తెలుగు సినిమా రంగంలో అత్యంత కమర్షియల్ బ్రెయిన్ ఉన్న నిర్మాత అల్లు అరవింద్ దీనిని ముందుగానే పసిగట్టాడు. అందుకే అమెజాన్ ప్రైమ్ కు పోటీగా ఆహా యాప్ పెట్టాడు. రోజుకు కేవలం ఒక్క రూపాయి లెక్కన సంవత్సరానికి కేవలం 365 రూపాయలు చెల్లిస్తే చాలు ఆహా యాప్ లో ఉన్న సినిమాలను మీరు ఇంట్లో కూర్చుని ఎప్పుడు వీలైతే అప్పుడు...ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ వాడుతున్న వినియోగదారులకు ఇది అనుభవమే... ప్రస్తుతం నగరాల్లో బయట ధియేటర్ లో కుటుంబం మొత్తం సినిమాకు వెళ్లి రావాలంటే టిక్కెట్లు, ట్రావెలింగ్, తిండి ఖర్చు కలిపి 1500 వరకు అవుతోంది. ఈ తరుణంలో అమెజాన్, ఆహా లాంటివి ప్రజలకు సువర్ణావకాశాలే... అయితే దీనివలన ధియేటర్ల యజమానులు దారుణంగా దెబ్బతింటారు. ఎగ్జిబిటర్ల వ్యవస్థ కుప్పకూలిపోతుంది. భవిష్యత్తులో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉండే స్క్రీన్ లు తప్ప... విడిగా థియేటర్లు దాదాపుగా కనుమరుగైపోవచ్చు.దీనికి తోడు ఈ లాక్ డౌన్ పీరియడ్ కూడా ఓ.టి.టి వారికి వరంగా మారింది. ప్రజలు కూడా వీటికి బాగా అలవాటు పడుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఇక థియేటర్లకు వెళ్ళడానికి ఇష్టం చూపక పోవచ్చు.   ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అన్నీ ఆ నలుగురి చేతుల్లోనే ఉన్నాయనే విమర్శ ఉంది. అయితే ఆ నలుగురిలో కూడా తెలివైన వాడు అరవింద్ కాబట్టే ముందుగా కళ్ళు తెరిచి ఓటీటీ పద్దతిలోకి అందరికంటే ముందుగా ఎంటర్ అయ్యాడు. ఏ బిజినెస్ లో అయినా ముందుగా ఎవరు ఎంటర్ అయితే వారిదే లాభాలు మెండు. ఆ తర్వాత ఎంటర్ అయితే పోటీ తప్పదు. అప్పుడు పైసలు ఏరుకోవాల్సిందే...
    కమల్ హాసన్ ఐదేళ్ల కిందటే  డి.టి.హెచ్ ప్రతిపాదన తెచ్చాడు

    సినిమా సాంకేతిక పరిజ్ఞానం మెండుగా ఉన్న కమల్ హాసన్ తన విశ్వరూపం సినిమా రిలీజ్ అప్పుడే ఒక ప్రతిపాదన తెచ్చాడు. తన సినిమాను డి.టి.హెచ్ (డైరెక్ట్ టు హోమ్) పద్దతిలో విడుదల చేస్తానని ప్రతిపాదన పెట్టాడు. దానికి తమిళనాడులో థియేటర్లు యజమానులు ఒప్పుకోకపోవడంతో ఆ ప్రతిపాదన చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఇది అనివార్యం  కానుంది. ఎవరు ఆపినా ఆగేది కాదు. సాంకేతిక విప్లవాన్ని ఎవరూ ఆపలేరు. మన కళ్ళ ముందు కాసెట్లు పోయాయి...వి.సి.ఆర్ లు, వి.సి.డీ లు కనుమరుగయిపోయాయి. కంప్యూటర్లో సి.డి వాడకం మాని, అందరూ పెన్ డ్రైవ్ వాడుతున్నారు. అది కూడా లేకుండా అంతా స్మార్ట్ ఫోన్ ద్వారానే పనులు అయిపోతున్నాయి. సో... రానున్న డిజిటల్ యుగానికి వినమ్రంగా స్వాగతం పలకడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పత్రికలు, థియేటర్లకు పెను ముప్పే Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top